About Me

" పంచాయితీ " లో తిరుపతి లడ్డు

 


ఎపిలో జరుగుతున్న గ్రామ పంచాయితి ఎన్నికల్లో తిరుపతి లడ్డు ఓ ప్రలోభంగా మారింది.చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లి నియోజక వర్గం పరిది లోని తొండ వాడ, తిరుచానూర్ మేజర్ గ్రామ పంచాయితీలలో తిరుమల కళ్యాణోత్సవం లడ్డూ తో పాటు తిరుచానారు అమ్మవారి లడ్డు ఓ కుంకుమ పాకెట్ ఇంటింటికి పంచి పెట్టారు. 

తొండ వాడ, తిరుచానూర్ లో చివరి దశ  గ్రామ పంచాయితి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల కోసం డబ్బులు పంచడం ఇతర వస్తువులు బహుమానంగా ఇవ్వడం పాత కథే కాని తిరుమల లడ్డూలు కూడ ప్రలోభాల జాబితాలో చేర్చడం ఓటర్లను విస్మయానికి గురి చేసింది. ఓటర్ స్లిప్పులతో పాటు అందమైన బాగులలో పెట్టి అంద చేస్తున్న లడ్డూలు తీసుకునేందుకు ఓటర్లు నిరాకరిస్తున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూలను చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి పవిత్రతను ఎన్నికలలో ఓట్ల కోసం వాడు కోవడం తగదని భక్తులు మండి పడుతున్నారు. ఇదంతా అధికార పార్టి నేతల పర్యవేక్షణలో జరుగుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ వాహనాల్లో  నే లడ్డూలు ఇంటింటికి చేరవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు