About Me

హోం క్వారంటైన్ లేకుంటే ప్రభుత్వ క్వారంటైన్ - మానుకోట జిల్లా కలెక్టర్ వి.పి గౌతం

 



హోమ్ క్వారంటైన్ పాటించని వారిని ప్రభుత్వ క్వారంటైన్ కు తరలించాలి...


కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు క్వారంటైన్ పాటించకపోతే ప్రభుత్వ క్వారంటైన్  కు తరలిస్తామని జిల్లా కలెక్టర్ వి.పి గౌతం అన్నారు.

గురువారం కలెక్టర్ గూడూరు మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పథకాల అమలు తీరును సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా కోవిడ్ పరీక్షల పనితీరును పరిశీలించేందుకు గూడూరు మండలం గాజుల గట్టు పంచాయతీలోని వస్త్రం తండా ను కలెక్టర్ సందర్శించారు.

కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల వివరాలను కోరగా వస్త్రం తండాలో 35 ఇళ్లు ఉన్నాయని, 32 మంది కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులు ఉన్నారని వైద్య సిబ్బంది కలెక్టర్ వివరించారు. దాంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకిలా జరిగింది  అని వివరాలు కోరగా వినాయక చవితి పండుగతో కోవిడ్ పాజిటివ్ సోకినట్లు తెలిపారు. వినాయక చవితి పండగ చేస్కో రాదని ముందుగా తెలియజేసిన నిర్లక్ష్యం వహించడం నేరంగా పరిగణిస్తున్న మన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమా...అని అధికారులు ఏమి చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అదేకాకుండా విద్యార్థుల కు స్కూల్ నిర్వహిస్తున్నారని వైద్య సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఉపాధ్యాయుని పై చర్య తీసుకుంటామని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో గూడూరు తహసీల్దార్ వెంకట రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు