About Me

శ్రీశైలం జలాశయం....నయనానంద....సుందర సోయగం....కన్నెకంటి వెంకటరమణ


              

కృష్ణా నది....  ఒంపు సొంపుల నది..అందమైన నది.. మహారాష్ట్ర మహాబలేశ్వర్లోని  పశ్చిమ కనుమల్లో ప్రారంభమై మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ నదికి మూసి, డిండి, భీమా లతోపాటు మరో ఆరు ఉపనదులున్నాయి.

ప్రస్తుత వర్షాకాల సీసాలో కృష్ణానదీ తీరా ప్రాంతమంతా విస్తారమైన వర్షాలున్నందున దీనిపై నున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా పూర్తి నీటితో ఉప్పొంగుతున్నాయి. 

ముఖ్యంగా, శ్రీశైలం డ్యాం నుండి మొత్తం 12 తలపులు గాను 10 తలపులు ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్నప్పటి దృశ్యం అత్యంత మనోహరం. పెద్ద పాల పొంగులా డ్యాం నుండి కిందకు దూకే కృష్ణమ్మ హొయలు నిజంగా వర్ణనాతీతం.

కృష్ణ కెరటాలు దూసుకొచ్చి పచ్చటి అడవులతో నిండిన కొండా కొనలా నడుమ పయనించే జలాలను చూస్తూ మనను మనమే మైమరచిపోతాం. 

పోటెత్తుతూ ప్రవహించే నదీ జలాలు సంతోషపెడతాయి..

డ్యాంలో పూర్తిగా నిండి ఉదృతంగా వచ్చే జలాలను గేట్లు తెరచి విడుదల చేసే నయనానందకర దృశ్యాన్ని ఎప్పుడో గానీ చూడడం నిజంగా అదృష్టం అని చెప్పవచ్చు....

కెరటాల కేరింతలతో సాగిపోతూ నాగార్జున సాగర్, పులిచింతల, కృష్ణా బ్యారేజ్ లను నింపుతూ కడలి గర్భాన కలిసిపోతూ కనువిందు చేసే కృష్ణా నది సోయగాలు ఏంతోమంది కవులు, కళాకారులను తట్టిలేపాయి..కృష్ణా పరివాహక ప్రాంతంలో జల సవ్వడులు, నేలంతా పరచుకొన్న పచ్చదనం ప్రతీ ఒక్కారినీ పోటాపోటీగా అలరిస్తాయి.. అక్కడి నీటి బిందువులు చిగురాకులను తడిమిన చప్పుడు మాదిరిగా గుప్పెడు గుండెలో నూతనోత్తేజాన్ని నింపుతుంది.. అలల గలగల  సవ్వడులు చప్పుడు  మనలో ఉల్లాస తరంగాలు ఉవ్వెత్తున లేస్తాయి.


Venkata Ramana


 కన్నెకంటి వెంకటరమణ

 డిప్యూటీ డైరెక్టర్

సమాచార, పౌర సంబంధాల శాఖ

9849905900

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు