About Me

కౌంట్ డౌన్ మొదలు........73 రోజుల్లో ఇండియాకి వాక్సిన్


భారతదేశంలో తక్కువలో తక్కువగా 68 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు నుంచి లెక్క వేస్తే 73 రోజుల్లో వాక్సిన్ అందుబాటులోకి రానుందా..అదీ ఉచితంగా..
     అవును..చదువుతున్నది నిజమే..వాక్సిన్ మూడో దశ ప్రయోగాలు 1700 మందిపై దేశవ్యాప్తంగా 17 కేంద్రాల్లో శనివారం నాడు మొదలయ్యాయి.ఈ ప్రయోగాలకు ఖచ్చితమైన ప్రణాళికను నిర్దేశించారు .ఆ మేరకు వాలంటీర్లకు తొలి డోస్ ఈ రోజు ఇవ్వగా 29 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తారు.అటు పిమ్మట మరో 29 రోజుల పాటు వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని.. ఇమ్మూనిటీ స్థాయిలను పరిశీలిస్తారు .అప్పటికి అంటే 29..29..అంటే నేటి నుంచి 58 రోజుల నాటికి హ్యూమన్ ట్రయల్స్ పూర్తయి నివేదికలు సిద్ధం అవుతాయి.ఆ తర్వాత 15 రోజులు ఆ నివేదికల పరిశీలన..వాక్సిన్ ఆమోదానికి అవసరమైన చర్యలు ఉంటాయి.అంటే 58కి పదిహేను కలిపితే 73 రోజుల తర్వాత వాక్సిన్ పై ప్రకటన వస్తుంది .ఈలోగా భారత ప్రభుత్వం Oxford  వాక్సిన్  COVISHIELD 68 కోట్ల డోస్ ల కోసం ఆర్డర్ ఇచ్చి ఉంది.ఆ మేరకు సెరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు ఉత్పత్తి కూడా ప్రారంభించింది.ఈ 68 కోట్ల వాక్సిన్లను మొదటి దశలో ఉచితంగా ఇచ్చి తర్వాత మిగిలిన జనాభా కోసం దేశీయ వాక్సిన్లు COVAXIN,ZYDAS CADILA..ఇంకా SII వాక్సిన్లను సిద్ధం చెయ్యాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
             *ఇ.సురేష్ కుమార్*
          22.08.20..10.45 PM

Post a Comment

0 Comments