About Me

ఈ ఏడాది లోనే కరోన విముక్తి...ట్రంప్

వాక్సిన్ దూరంలో లేదు..

అమెరికా ప్రజలు ఈ ఏడాదిలోనే కరోనా  మహమ్మారి పీడ నుంచి విముక్తులు అవుతారని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.ఈ ఏడాదిలోనే దేశంలో వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. కోవిడ్ పై జరుగుతున్న పోరులో విజయం సాధించే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు.
     ఇదిలాఉండగా ఇంగ్లాండ్ లాగే భారత్ కూడా ఈ ఏడాదిలోనే వాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలను వేగవంతం చేసింది.దేశీయంగా తయారైన covaxinతో పాటు Oxford వాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి.ఈ రెంటిలో ఏదో ఒకటి అత్యవసర వినియోగానికి ఎప్పుడైనా..బహుశా అక్టోబర్లో ఆమోదం పొందే అవకాశం ఉంది.Oxford వాక్సిన్ రెండో దశ హ్యూమన్ ట్రయల్స్ పూనేలో ఇప్పటికే మొదలు కాగా ముంబైలో వాక్సిన్ ట్రయల్స్ కోసం 500 మంది తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుకు రావడం వాక్సిన్ కోసం భారతీయుల తహతహ కు సంకేతంగా పేర్కొనవచ్చు.చండీగఢ్ లోని pgi లో కూడా Oxford వాక్సిన్ ట్రయల్స్ కోసం వాలంటీర్ల నమోదు మొదలైంది.
     మరో ఆసక్తికరమైన..ఆశాజనకమైన సమాచారం ఏమిటంటే రష్యా వాక్సిన్ స్పుత్నిక్ వి ని భారత్ కు రప్పించేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం మరో పక్క అమెరికా వాక్సిన్ Pfizer తో కూడా సంప్రదింపులు జరుపుతోంది.ఈ వాక్సిన్ పనితీరుపై గురువారమే వివరాలు వెల్లడి కాగా భారత ప్రభుత్వం ఆ దిగ్గజ వాక్సిన్ సంస్థలతో మర్నాడే చర్చలు ప్రారంభించడం విశేషం..ఈ చర్యలన్నీ వాక్సిన్ తెచ్చే విషయంలో మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధిని,వేగాన్ని సూచిస్తున్నాయి.ఇలాంటి పరిణామాలన్నీ అయితే అక్టోబర్లో..కాస్త ఆలస్యం అయినా నవంబర్,డిసెంబర్ నెలల్లో...మొత్తానికి 2020 సంవత్సరంలోనే వాక్సిన్ రావడం తథ్యమనే శుభవార్తను చెప్పక చెబుతున్నాయి.

      *ఇ.సురేష్ కుమార్*
       28.08.20..8.30 pm

Post a Comment

0 Comments