About Me

కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి ........ అఖిలపక్ష పార్టీల నేతల డిమాండ్


రాష్ట్ర అఖిల పక్ష రాజకీయ పార్టీల పిలుపు మేరకు సోమవారం రెండవ రోజు హనుమకొండ లోని శ్రీ శరణ్య హాస్పిటల్ ములుగు రోడ్డు లోని హజరా ఆస్పటల్ లను అఖిలపక్ష పార్టీల నేతలు సందర్శించారు.హస్పత్రులలో కొవిడ్-19 పేషెంట్లకు వారు అందిస్తున్న వైద్య చికత్సతో పాటు ఆస్పత్రి సిబ్బంది తదితర సౌకర్యాలు బిల్లుల వసూలు చేస్తున్న తీరు  ఆసుపత్రి నిర్వాకులను అఖిలపక్ష పార్టీల బృందం అడిగి తెలుసుకున్నారు.*

*ఈ అఖిలపక్ష పార్టీల బృందంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆరెళ్ళికృష్ణ తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షులు చిటూ రి అశోక్ సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాగుల రమేష్ సిపిఐ నగర కార్యదర్శి ఎండి  భాషు మీయా లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు చెప్పడమే తప్ప చేతలు లేవని కరోనా చికిత్స ను అందిస్తున్న హాస్పిటల్స్ లో చికిత్సకు ఎంత ధర చెల్లించాలో ధరల పట్టిక పెట్టాలని చెప్పారని మేము హాస్పిటల్ యజమాన్యం ను అడిగితే మాకు ఎలాంటి జీవో రాలేదని జీవో వస్తే తప్పకుండా పాటిస్తామని అన్నారనిఇప్పటికైనా సీఎం కేసీఆర్ గారు మాటలు చెప్పడం మాని జీవోను వెంటనే జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రజల ఆరోగ్యం పట్టడం లేదని ప్రైవేట్ హాస్పిటల్స్ నియంత్రించాలని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.*

*ఈ బృందంలో న్యూడెమక్రసీ జిల్లా నాయకులు నున్నా అప్పారావు, తెలుగుదేశం పార్టీ సీనయర్ నాయకులు మార్గం సారంగం PYL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్,CPI నాయకులు కండె నర్శయ్య విక్కీ తదితరులు ఉన్నారు.*

Post a Comment

0 Comments