About Me

పోలీసులకు సవాల్ గ నిలిచిన మిర్యాల గూడ యువతి కేసు....ఎఫ్ ఐఆర్ లో యాంకర్ ప్రదీప్ పేరు

వేగంగా కొనసాగుతున్న దర్యాప్తు
139 మందిపై కేసు నమోదు...ఎఫ్ ఐఆర్ లో  యాంకర్  ప్రదీప్ పేరు


దారుణాతి దారుణం....139 మంది తనపై అత్యాచారం చేశారని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన  25 ఏళ్ల యువతి పంజాగుట్ట  పోలీసులను ఆశ్రయించిన కేసు సంచలనంగా మారింది. ఓ స్వచ్చంద సంస్థ సహాయంతో ఆయువతి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి చెప్పిన విషయాల వెనక వాస్తవాలు ఆరా తీసే పనిలో పడ్డారు.  ఈ కేసు న్యాయపరంగా ఎంత వరకు నిలబడుతుందో కాని ఇంత వరకు ఇలాంటి ఫిర్యాదులు ఎక్కడా వచ్చిన దాఖలాలు లేవు. 2009 నుంచి తనపై అత్యాచారాలు జరిగాయని వివిద రంగాలకు చెందిన వందలాది మంది లో కొందరు ప్రముఖులు కూడ ఉన్నట్లు వారి పేర్లు వెల్లడించింది. ఓ మాజి ఎంపి దగ్గర పనిచేసిన  పిఏతో పాటు  బుల్లి తెర యాంకర్  ప్రదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు ఆశామాషిగా లేదు...సినీ నిర్మాతలు, కెమెరామెన్, ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్, మాజీ ఎంపీ, వాళ్ల పీఏ అలాగే ప్రముఖ డాక్టర్‌తో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు చాలా మంది పేర్లు ఎఫ్ ఐ ఆర్‌లో ఉన్నాయి. వీరిపై నిర్భయ కేసుతో పాటు పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.
చిన్నతనంలో మైనార్టీ తీరక ముందే వివాహం జరిగిన ఆ యువతి భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత చదువుకునేందుకు హైదరాబాద్ నగరానికి చేరిన యువతి రాజ్ భవన్ రోడ్ లో ఓ అపార్ట్ మెంట్ లో  నివాసం ఉన్న కాలంలో  అనేక మంది 5 వేల సార్లు అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. పలు మార్లు గ్యాంగ్ రేప్‌లు కూడా చేశారని.. గర్భం దాల్చితే అబార్షన్ చేయించారని.. ఫోన్లలో తనను నగ్నంగా చిత్రీకరించి హింసించారని  ఫిర్యాదులో పేర్కొంది ఆ యువతి. ఈ 139 మంది రేపిస్ట్‌లలో తెలుగు రాష్ట్రాలవారే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారని.. ఎవరికైనా చెప్తే చంపేస్తాం అని బెదిరించడంతో తాను ఇప్పటివరకూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్టు తెలిపింది. అయితే ఒక స్వచ్ఛంద సంస్థ ధైర్యం నింపుతూ  తనకు ఉండ దండగా నిలవడంతో ఫిర్యాదు చేసినట్టు యువతి వివరిచింది.
కేసులో అనేక మంది వివిద రంగాలకు చెందిన వారు ఉండడంతో ఈ కేసు ఎటు నుండి ఎటు మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడ ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్నారు. యువతి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రాథమికంగా విచారించిన అనంతరమే  కేసు నమోదు చేసారు.

Post a Comment

0 Comments