About Me

అత్యుత్తమ వాక్సిన్ ఇస్తాం:కృష్ణ ఎల్లా

అత్యుత్తమ వాక్సిన్ ఇస్తాం:కృష్ణ ఎల్లా

అంతర్జాతీయ ప్రమాణాలకు 

ధీటుగా..moderna..sanofi..gsk..Oxford వాక్సిన్ లకు నాణ్యత విషయంలో ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వాక్సిన్ తీసుకువచ్చేందుకు కట్టుబడి పనిచేస్తున్నామని భారత్ బయోటెక్ చైర్మన్..మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు.
       వీలైనంత త్వరగా వాక్సిన్ సిద్ధం చేయాలని తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నా నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని కృష్ణ చెప్పారు.మామూలుగా వాక్సిన్ తయారు కావడానికి చాలా కాలం పడుతుందని..
రోటా వైరస్ మొదటి దశ ప్రయోగాలకే ఆరు నెలలు పట్టిందని.. కోవిడ్ వాక్సిన్ తొలి దశ ప్రయోగాలను నెలలోనే పూర్తి చేసి రెండో దశలోకి
వచ్చేసామని పేర్కొన్నారు. వాక్సిన్ల విషయంలో మన దేశంపై కొన్ని దేశాలకు చిన్న చూపు ఉందని..అయితే ఆ పరిస్థితిని వెక్కిరిస్తూ మనమే రోటా వాక్సిన్..పోలియో వాక్సిన్ లను ప్రపంచానికి అందించామని అన్నారు.ఇప్పుడు కూడా కోవిడ్ మహమ్మారి పీడ శాశ్వతంగా వదిలిపోయేలా వాక్సిన్ ను అత్యంత ప్రభావవంతంగా తీసుకువస్తామని చెప్పారు.వాక్సిన్ విషయంలో తాము ఇంతవరకు మన ప్రభుత్వం నుంచి గాని..ప్రపంచ సంస్థల నుంచి గాని నిధులు తీసుకోలేదని చెబుతూ ప్రతి రూపాయి తామే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.
            *ఇ.సురేష్ కుమార్*
            09.08.20..7 pm

Post a Comment

0 Comments