About Me

కరోనా భరతం పట్టే యంత్రం- బెంగళూరు సంస్థ ఆవిష్కరణ



కరోనా వైరస్ ఉనికిని పసిగట్టి దాని ప్రభావాన్ని నశింపచేసే ఓ పరికరం... దోమల నియంత్రణకు వాడే గుడ్ నైట్ ..అలౌట్ వంటిది వస్తే బాగుణ్ణు ..ఇలాంటి ఆలోచన కరోనా మహమ్మారి విశృంఖల విహారం మొదలైనప్పటి నుంచి చాలా మందికి వచ్చే ఉంటుంది..దానికి వాస్తవ రూపమే బెంగళూరుకు చెందిన CENTRE FOR ADVANCED RESEARCH AND DEVELOPMENT,(CARD)కనిపెట్టిన యంత్రం..SHYCOCAN (SCALYNE HYPOCHARGE CORONA CANON)పదివేల క్యూబిక్ అడుగుల పరిధిలో ప్రభావం చూపుతుంది.ఈ యంత్రం 110/240వి..లేదా50/60 hz వాల్ సాకెట్ ఫ్లగ్ తో పనిచేసి సిగ్నల్స్ పంపి వాటి ద్వారా కరోనా వైరస్ మానవ శరీరంలో పునరుత్పత్తి చేసుకునే ప్రక్రియ కు అవసరమైన కణాలను నిర్వీర్యం చేస్తుందని card సంస్థ చైర్మన్ డాక్టర్ రాజా విజయ్ కుమార్ తెలిపారు.షాపింగ్
కాంప్లెక్సులు..గృహసముదాయాలు..పరిశ్రమల్లో ఈ పరికరాలను నిర్భయంగా..నమ్మకంగా వాడుకోవచ్చని ఆయన చెప్పారు.తాము అప్పుడే ఏడాది నుంచి తమ కాంపౌండ్ లో వాడుతున్నామని తెలిపారు.కరోనా మాత్రమే గాక సార్స్ కుటుంబానికి చెందిన అన్ని వైరస్ లను నియంత్రించ గలుగుతుందని చెప్పారు.ఇది చాలా సురక్షితమని.. సమర్థవంతంగా పని చేస్తుందని  నమ్మిన అమెరికా ఉత్పత్తికి అంగీకరించిందని..యూరప్ లో మార్కెటింగ్ కూడా అమెరికానే చేస్తుందని ఆయన తెలిపారు.ఈ యంత్రం ఎటువంటి రసాయనాలు గాని.. గాస్ గాని విడుదల చేయదని..కేవలం ప్రోటాన్లు మాత్రమే విడుదల చేసి కరోనా పని పడుతుందని ఆయన చెప్పారు.
         ఇ.సురేష్ కుమార్
        02.08.20..7.15 pm

Post a Comment

0 Comments