About Me

దూరం పెరిగిన సమయంలో గవర్నర్ తో ముఖ్యమంత్రి భేటి -పలు కీలక అంశాలపై చర్చ

ప్రభుత్వానికి గవర్నర్ కు ఈమద్య  కాస్త దూరం పెరిగినట్లు సంకేతాలు వెలువడడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తో సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.ఈసందర్భంగా కరోనా వైరస్, సచివాలయం కూల్చివేతలు,ఎమ్మెల్సి స్థానాల భర్తి వంటి  అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ స్థితిగతులు ప్రభుత్వం చేపట్టిన చర్యలను గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. కరోనా  వ్యాప్తి చెందుతున్న తీరును దాని  నియంత్రణకు  తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం అందిస్తోన్న వైద్యం తదితర అంశాలను ఆయన గవర్నర్‌కు వివరించారు. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశంపైనా కేసీఆర్ గవర్నర్ తో  చర్చించారు.

కరోనా నియంత్రణ విషయంలో ఇప్పటికే పలు మార్లు హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించింది. బుల్లెటిన్ల విడుదల నుండి మొదలు చికిత్స విధానాలు, ప్రైవేట్ ఆసుపత్రులు లాబరేటరీలలో అధిక ఫీజులు తదితర అంశాలపై హోకోర్టు పలు మార్లు సీరియస్ అియంది. గవర్నర్ కూడ నేరుగా కరోనా నియంత్రణ విషయంలో స్వయంగా పర్యవేక్షణకు ఉపక్రమించారు. ఆసుపత్రుల సందర్శనతో పాటు వైద్యులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో కూడ గవర్నర్ నేరుగా సమావేశం అయి కీలక ఆదేశాలు జారి చేసారు.రాష్ర్ట ప్రభుత్వం ఉన్నతాధికారులతో నేరుగా పరిస్థితులు సమీక్షించేందుకు గవర్నర్ ప్రయత్నాలు చేయగా అధికారులు మాత్రం హాజరుకాలేదు. దాంతో రాష్ర్ట ప్రభుత్వానికి గవర్నర్ కు మద్య దూరం పెరిగిందనే సంకేతాలు వెలువడ్డాయి. ఇ పరిస్థితులలో ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్ తో బేటి కావడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

అదే విదంగా ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోది  సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆరా తీశారు. కరోనా నియంత్రణ విషయంలో ఒక వైపు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మరో వైపు గవర్నర్ నేరుగ రంగంలోకి దిగడంతో పాటు ప్రతి పక్షాలు కూడ ప్రభుత్వం కరోనా విషయంలో సరైన విధానాలు పాటించడం లేదని దుమ్మెత్తి పోస్తున్నాయి.ఈ పరిస్థితులలో సమస్యలు చేయి దాటి పోకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి గవర్నర్ ను కలిఉంటారనేది రాజకీయ వర్గాల  విశ్లేషణ. గతంలో నర్సింహన్ గవర్నర్ గా ఉన్న సమయంలో దాదాపు నెల కోమారు భేటి ఆయిన కెసిఆర్, తమిళిసై సౌందరరాజన్‌ గవర్నర్ గా వచ్చిన తర్వాత ఎందుకు క్రమంగా బేటి కావడం లేదనే విమర్శలకు కూడ ఫులిస్టాప్ పెట్టేందుకు సిఎం కలిసి ఉంటారనే వాదన ఉంది.

తెలంగాణలో  కరోనా కేసులు దేశంలో ఇతర రాష్ర్టాలలో  పెరిగిన రీతిలో రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి.రాష్ర్టంలో 50 వేలకు చేరువలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.తెలంగాణలో ఇప్పటి వరకు 2,65,219 కరోనా టెస్టులు నిర్వహించగా  45,076 మందికి పాజిటివ్ గా నిర్దారణ జరిగింది.వీరిలో 32,438 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో 17,081 బెడ్స్ అందుబాటులో ఉండగా.15,181 పడకలు ఖాళీగా ఉన్నాయి.



Post a Comment

0 Comments