About Me

కరోనా భాదితులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు - ప్రభుత్వ వైద్యురాలినే భందించిన ఆసుపత్రి సిబ్బంది

ఇంతబిల్లేంటని ప్రశ్నించినందుకు గదిలో ఉంచి నిర్భందం
ఏడుస్తూ వీడియో రికార్డు చేసి గోడు వెల్ల బోసుకున్న ప్రభుత్వ  వైద్యురాలు


కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడంతో అందిన కాడికి దోచుకుంటున్నారు.
కరోనా చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ప్రభుత్వ వైద్యురాలిని బిల్లు కట్టలేదని గదిలో నిర్భంధించారు. ఫీవర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుల్తానా కరోనాతో ఊాదపడుతూ ఛాదర్ ఘాట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. 24 గంటల్లోనే కండ్లు బైర్లు కమ్మే బిల్లు వేశారు.

ఒక రోజు ట్రీట్మెంట్‌కు రూ.40 వేలు వసూలు చేశారు. డిశ్చార్జి చేయాలంటే రూ.1.15 లక్షలు కట్టాలని హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ సుల్తానా చెప్పింది. తన దగ్గర అంత డబ్బు లేదని సుల్తానా చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ఆమెను ఒక గదిలో బంధించి డబ్బులు ఇస్తేనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.
ఆసుపత్రిలో భందీగా ఉన్న డాక్టర్ సుల్తానా వీడియోలో తన భాదను రికార్డు చేసి ఏడుస్తూ తన భాదను చెప్పుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజెన్లు ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వాన్ని తిట్టి పోస్తున్నారు. ప్రభుత్వ ం నిర్ణయించిన ఫీజులు కాకుండా ఇష్టానుసారం దోచుకుంటున్నారనేందుకు ఇది నిదర్శనం.

ఒక ప్రభుత్వ వైద్యురాలిపట్లనే ఇంతదారుణంగా వ్యవహరిస్తే సామాన్యుల పట్ల ఇంకా ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. ప్రభుత్వ వైద్యురాలి పట్ల అమర్యాదగ వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై ప్రభుత్వం ఖఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్  చేపట్టాలి.

Post a Comment

0 Comments