About Me

అనంతపద్మనాభ స్వామి ఆలయం బాధ్యత ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానిదే - సుప్రీంకోర్టు తుది తీర్పు



కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం బాధ్యత ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తుది తీర్పు వెలువరించింది.
ఆలయ నిర్వహణ బాధ్యతను రాజకుటుంబానికే అప్పగిస్తున్నట్లు చెప్పింది.ఆలయ కార్యకలాపాల నిర్వహణ కోసం త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి  నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ఈ కమిటీ కొనసాగుతుందని చెప్పింది.అనంత పద్మనాభస్వామి ఆలయం, పరిపాలనపై సర్వ హక్కులకూ ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అప్పగించింది. ఆలయ పరిపాలన, నిర్వహణపై పూర్తి హక్కుదారులు ట్రావెన్ కోర్ రాజ వంశీయులేనని తీర్పు ఇచ్చింది. ఈ మేరకు అంతులేని ధనరాశులు, గుప్త నిధులు ఉన్నట్లుగా భావిస్తోన్న నేలమాళిగలోని ఆరో గది తలుపులను తెరవాలా? వద్దా? అనే విషయంపై తుది నిర్ణయాన్ని తీసుకునే హక్కు ట్రావెన్ కోర్ రాజ వంశీయులకు ఉందని స్పష్టం చేసింది.  నేల మాళిగల్లోని ఆరు గదుల్లో అయిదింటిని 2011లో తెరిచిన విషయం తెలిసిందే. ఈ అయిదింట్లో కూడా ఒక గదిని మించి మరో గదిలో అంతులేని నిధులు వెలుగులోకి వచ్చాయి. వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలు, నగలు, వజ్రాలు.. ఇలా విలువ కట్టడానికి కూడా సాధ్యపడలేనన్ని నిధులు ఆ అయిదు గదుల్లో కనిపించాయి.శతాబ్దాల కిందటి నుంచీ వారసత్వ సంపదగా వస్తోన్న ఆ ధనరాశులు నిల్వ ఉంటూ వచ్చాయి.
ఆలయం నేలమాళిగల్లో ఉన్న ఆరు గదులు.. అందులో ఉన్న అంతులేని ధనరాశులు. ఆలయానికి చెందిన అయిదు గదులను తెరిచినప్పటికీ.. ఆరో గది తలుపులను తెరవడానికి సాహసించట్లేదు. ఆ గది తలుపులను తెరిచే ధైర్యం చాలట్లేదు ఎవరికీ. ఈ గది తలుపులు తెరవాలా? వద్దా? అనే విషయంపై తొమ్మిదేళ్ల తరువాత కూడా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు.నేల మాళిగల్లోని ఆరు గదుల్లో అయిదింటిని 2011లో తెరిచారు.ఈ అయిదింట్లో కూడా ఒక గదిని మించి మరో గదిలో అంతులేని నిధులు వెలుగులోకి వచ్చాయి. వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలు, నగలు, వజ్రాలు.. ఇలా విలువ కట్టడానికి కూడా సాధ్యపడలేనన్ని నిధులు ఆ అయిదు గదుల్లో కనిపించాయి. శతాబ్దాల కిందటి నుంచీ వారసత్వ సంపదగా వస్తోన్న ఆ ధనరాశులు నిల్వ ఉంటూ వచ్చాయి.ఆరో గదిని కూడా తెరవడానికి అప్పట్లో కేరళ మంత్రిత్వ శాఖ ప్రయత్నించగా.. ట్రావెన్ కోర్ రాజవంశీయులు అడ్డుపడ్డారు.ఆరోగది తలుపులపై నాగబంధనం ముద్ర ఉందని,దాన్ని తెరిస్తే వినాశనం తప్పదంటూ అప్పట్లో ట్రావెన్ కోర్ రాజ వంశీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆ ఆరోగది తలుపులను తెరవడానికి ప్రయత్నించగా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేరళ హైకోర్టులో పిటీషన్లను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆలయంపై ట్రావెన్  కూర్ రాజవంశీయులకు మాత్రమే హక్కు ఉందని స్పష్టం చేసింది.కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.దీనిపై విచారణ చేపట్టింది. ఇప్పటికే విచారణ ముగించినప్పటికీ.తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.సోమవారం ఈ తీర్పును వెలువరించింది.
ఇక ఆరోగది తెరుచుకోవడం ఇక కుదరదనే అంటున్నారు.ఎందుకంటే ట్రావెన్ కోర్ రాజవంశీయులు ఆరో గది తలుపులు చెరిచేందుకు  ఇష్టపడం లేదు.కాబట్టి ఆరోగదిలో ఏముందో ఆ రహస్యం ఏమిటో అంతా మిస్టరీగానే మిగిలి పోనుంది.

Post a Comment

0 Comments