About Me

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల

వరవరరావును వెంటనే విడుదల చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కోవిడ్ 19 నిపుణుల కమిటీ కోరింది. NHRC ఇటీవల కోవిడ్ 19 ప్రభావాన్ని అంచనా వేయడానికి ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నిపుణుల కమిటీ మహారాష్ట్ర తలోజా జైల్లో ఉన్న‌ వరవరరావు ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు NHRC చైర్మన్ హెచ్‌ఎల్ దత్తుకు విఙప్తి చేశారు.
అనారోగ్య కారణాల వల్ల వరవరరావును పెరోల్ పై విడుదల చేసి ఆయన కుటుంబానికి అప్పగించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్‌పర్సన్‌ను నిపుణుల కమిటీ కోరింది.

ʹʹవరవరావు ఆరోగ్యం బాగా క్షీణించింది, అతని వయసు 80 ఏళ్ళకు పైనే ఉంటుంది. పైగా జైల్లో అతను కరోనా కు గురయ్యే అవకాశాలున్నాయి. అతని వయస్సు మరియు క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితి, శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటినీ పరిగణనలోకి తీసుకుని అతన్ని వెంటనే విడుదల చేయాలి లేదా వెంటనే ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లాలి" అని హక్కుల కమిషన్ నిపుణుల సంఘం డిమాండ్ చేసింది.

కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇన్షియేటీవ్ డైరక్టర్ మజా దారువాలా ఇప్పటికే ఈ విషయం యొక్క ఆవశ్యకతను H.L దత్తు దృష్టికి తీసుకువచ్చారని, వారు విషయాన్ని అర్థం చేసుకున్నారని కమిటీ సభ్యులు తెలిపారు.

"అయినప్పటికీ, ప్రజారోగ్య నిపుణులు మరియు కమిటీ సభ్యుల మైన మేము కూడా ఈ విషయం యొక్క‌ అత్యంత ఆవశ్యకత అవసరాన్ని నొక్కిచెప్పడానికి ఈ విఙప్తి చేస్తున్నాము" అని వారు తెలిపారు.

వరవరరావు ఉన్న తలోజా జైల్లో కరోనా పరిస్థితి గురించి NHRC స్వయంగా తెలుసుకోవాలని, అదే విధంగా వీవీ ఆరోగ్యం క్షీణించినప్పటికీ అత్యవసర వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి ఎందుకు తరలించలేదో వివరణ కోసం జైలు అధికారులను ప్రశ్నించాలని నిపుణుల కమిటీ NHRC చైర్మన్ ను కోరింది.
 Source..avaninews

Post a Comment

0 Comments