About Me

మూడు లక్షల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యం అంటూ ట్వీట్ చేసిన సోనూ సూద్

నిరుద్యోగులకు శుభవార్త...మూడు లక్షల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యం అంటూ జన్మదినం రోజు ట్వీట్ చేసిన సోనూ సూద్


సోనూ సూద్.. సేవాతత్ఫరతకు మారు పేరుగా నిలిచిన ఓ మనిషి పేరు. దేశంలో ప్రస్తుతం వైరల్ టాపిక్ అయిన నామధేయం. వృత్తిపరంగా పాత్రల్లో విలన్ గా ఒదిగి పోయినా ప్రవృత్తి పరంగా స్నేహహస్తం అందించిన మానవత్వం అతనిది. కరోనా కష్టకాలంలో కాళ్లు చేతులు ఆడని దేశీ వలస కార్మికులు కావచ్చు.... విదేశాలలో చిక్కుకు పోయిన ప్రవాసీలు కావచ్చు అందరిని.... గూటికి చేర్చేందుకు సోనూ సూద్ చేసిన సహాయం వేనోళ్ల ముచ్చటగా నిలిచింది.

వలస కార్మికుల కోసం ఇప్పటికే ప్రవాసి రోజ్ గార్ పేరిట ఓ పోర్టల్ ప్రారంభించిన సోనూ సూద్ నిరుద్యోగులకు మూడు లక్షల ఉద్యోగాల కల్పనే తన లక్ష్యమని పేర్కొటూ ఈ మేరకు  ట్వీట్‌ చేశారు

తన జన్మదినం సందర్భంగా జూలై 30 న సోనూ సూద్ మరో కీలక ప్రకటన చేసాడు.

‘నా పుట్టినరోజు సందర్భంగా చిరు ప్రయత్నం చేస్తున్నాను. ప్రవాసీరోజ్‌గార్‌.కామ్‌ ద్వారా మూడు లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించాం. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐతోపాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి’ అని సోనూ సూద్ ట్విటర్‌లో‌ వెల్లడించారు. ఈ సందర్భంలో తనతో కలసి పనిచేయాడానికి సిద్ధమైన సంస్థలకు సోనూ సూద్‌ ధన్యవాదాలు తెలిపారు. వీటిలో ఏఈపీసీ, సీఐటీఐ, ట్రైడెంట్, క్వెస్‌కార్ప్‌, అమెజాన్‌, సొడెక్సో వంటి సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారానే ఆయా రాష్ట్రాల్లో అర్హులకు  ఉద్యోగాలు కల్పించే ఉపాధి కేంద్రంగా వ్యవహరించాలని  సోనూ సూద్ నిర్ణయించడం అభినందనీయ. సంపూర్ణ సేవా భావంతో సోనూ సూద్ తలపెట్టిన ఈ కార్యక్రమాలకు కార్పోరేట్ సంస్థలు కూడ పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. నిరుద్యోగ సమస్యపై సెలెబ్రిటి అయిన ఓ పాపుల్ ఆక్టర్ చొరవ తీసుకోవడం మంచి పరిణామం. 

Post a Comment

0 Comments