About Me

అక్టోబర్ లో అమెరికా వాక్సిన్



అమెరికా ప్రజలకు రానున్న ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవ్వబోతున్న కానుక ఏంటో తెలుసా..
హడలగొడుతున్న మహమ్మారి కరోనా వైరస్ నుంచి విముక్తి ప్రసాదించే వాక్సిన్ ..అది కూడా ఉచితంగా..
      PFIZER,MODERNA,
OXFORD వాక్సిన్ లలో ఏదో ఒకటి అక్టోబర్ నాటికి అమెరికన్ల పాలిట సంజీవినిలా అందుబాటులోకి రానుంది.
       వాస్తవానికి వచ్చే ఏడాది ప్రారంభం నాటికి గాని వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని మొదట్లో భావించినా ట్రంప్ సర్కార్ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ పేరిట భారీ ఎత్తున నిధులు కేటాయించడంతో ప్రయోగాలు ఊపందుకున్నాయి.అక్టోబర్ నాటికి కనీసం వంద బిలియన్ డోసులు అందుబాటులోకి తేవాలని లక్ష్యం..ఆ తర్వాత దశల వారీగా మరో 500 మిలియన్ డోసులు ఉత్పత్తి అవుతాయి.
       మొత్తానికి ఒక్కో వాక్సిన్ ప్రయోగాల దశ దాటి జనాలకు అందుబాటులోకి వస్తున్నాయి.కనీసం దశాబ్ద కాలం పట్టే వాక్సిన్ ప్రయోగాలను ..తక్కువలో తక్కువగా 12 నుంచి 18 నెలల వ్యవధి తీసుకుంటుందని..ఎంత వేగంగా ప్రయత్నాలు చేసినా కనీసం 2021 మొదటి మూడు నెలల మధ్యనే వాక్సిన్ వస్తుందనే అంచనాలను తలక్రిందులు చేస్తూ మొదటగా రష్యా ఆగస్టు రెండో వారంలో..అమెరికా అక్టోబర్ లో వాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేస్తున్నాయి..ఇప్పుడిక భారత్ వంతు..ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ముందుగా వాక్సిన్ విడుదలకు ఓ తేదీ(ఆగస్టు 15)ప్రకటించిన భారత దేశంలో స్వదేశీ వాక్సిన్  ప్రయోగాలు ఇంకా మొదటి దశలోనే ఉండడం గమనార్హం.
ప్రపంచంలో  ఏ వాక్సిన్ ఉత్పత్తిలోనైనా ముందుండే భారత్..చైనా ఇంకా నిర్దిష్టమైన ప్రకటనతో ముందుకు రావాల్సి ఉంది..
            *ఇ.సురేష్ కుమార్*
          30.07.20...7.30 am

Post a Comment

0 Comments