About Me

అరనిమిషంలో కోవిడ్ గుట్టు రట్టు

అరనిమిషంలో కోవిడ్
గుట్టు రట్టు
ప్రయోగాల కోసం ఇజ్రాయిల్ నుంచి ఇండియాకు రాక
అన్నీ బాగుంటే త్వరలోనే సాధారణ పరిస్థితులు

మరో అడుగు ముందుకు పడింది.ఈసారి మరో దిశగా..శరీరంలో చేరిన మహమ్మారి కరోనా ఆనుపానులను క్షణాల్లో పసిగట్టే టెస్టింగ్ పరికరాలతో ఇజ్రేయిల్ శాస్త్ర బృందం ప్రత్యేక విమానంలో వచ్చింది.రోగ చికిత్సకు వీటికి సంబంధం లేకపోయినా నిర్ధారణకు ఎంతో ఉపయోగపడే ఈ మాజిక్ పరికరాలు భారత్ లో జరిపే ప్రయోగాలు విజయవంతం అయితే..మొత్తం నాలుగింటిలో  ఒక్కటి ఒకే అయితే
కోవిడ్ పై ప్రపంచం జరుపుతున్న పోరాటంలో game changer ఆవిష్కారం అయినట్టే..
         కోవిడ్ ఉత్పాతం మొదలైన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ,ఇజ్రాయిల్ దేశాధినేత బెంజమిన్  నెతన్యాహు పరస్పరం మూడుసార్లు విస్త్రుతంగా చర్చలు జరిపారు.మహమ్మారిపై పోరులో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిపూర్ణ సహకారంతో పనిచేయాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.పర్యవసానంగా ప్రయోగాల కోసం  ఇజ్రాయిల్ తమ దేశం కనిపెట్టిన నాలుగు అత్యాధునిక పరీక్షా పరికరాలను విస్తృత స్థాయిలో ప్రయోగించి ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే ప్రపంచానికి పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారు.ఈ పరికరాలు ఇజ్రాయిల్ లో సానుకూల ఫలితాలు ఇచ్చాయట.
           ప్రత్యేక విమానంలో ఇజ్రాయిల్ నుంచి రాయబారి,ఉన్నత స్థాయి నిపుణుల బృందం తీసుకు వచ్చిన ఈ పరికరాలు నాలుగు రకాలు.మొదటిది ఆడియో డివైజర్..మనిషి మాటను రికార్డ్ చేసి కోవిడ్ ఉందో లేదో చెప్పేస్తుంది.అలాగే మరో పరికరం..దీనికి అమర్చి ఉన్న గొట్టంలో ఊదితే గుట్టు విప్పేస్తుంది.మూడోది ఇప్పుడు వాడుతున్న ధర్మల్ పరికరాల్లో మరింత ఆధునికమైనది.ఈ మూడు పరికరాలు కళ్ళు మూసి తెరిచేలోగా రోగనిర్ధారణ చేసేస్తాయి.అంటే కేవలం అర నిమిషంలో..నాలుగోది
పోల్యుమిని పరీక్ష.ఈ నాలుగింటిలో ఒక్కటి పూర్తిగా విజయవంతమైతే..అంతకు మించి అన్నీ సక్సెస్ అయితే వాక్సిన్ వచ్చేలోగా ప్రపంచంలో సాధారణ జీవన స్థితిగతుల పునస్థాపనకు లైన్ క్లియర్ అయినట్టే..జనం వచ్చే ప్రతి చోట ఇవి మెటల్ డిటెక్టర్లలా అమరిస్తే ఇక ఏ సమస్యా ఉండదు.ఇజ్రాయిల్ బృందం ఈ ప్రయోగాల్లో AIIMS తో కలిసి పనిచేస్తుంది.
      ఇవి గాక ప్రమాదంతో సహచర్యం అన్నట్టు పనిచేస్తున్న వైద్య సిబ్బంది కోసం కూడా ఇజ్రాయిల్ బృందం అత్యాధునిక రోబోటిక్ పరికరాలను తీసుకు వచ్చింది.ఇవి వైద్యులు రోగికి దూరంగా ఉంటూనే చికిత్స చేసేందుకు ఉపయోగపడతాయి.
అంతేగాక అత్యాధునిక
రెస్పిరేటరీ పరికరాలు కూడా వచ్చాయి.
          *ఇ.సురేష్ కుమార్*
         28.07.20..6 PM

Post a Comment

0 Comments