About Me

దాడులు ఆపక పోతే టీఆర్ ఎస్, బిజెపి నేతలకు శిక్షలు తప్పవు......మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన మీడియా ప్రకటన....
కరోనా మహమ్మారి ప్రజలను హతమార్చుతున్న ఈ కాలంలో మావోయిస్టు పార్టీ భౌతిక దాడులకు పాల్పడకుండా స్వీయనియంత్రణ పాటిస్తుంటే కేసిఆర్, నరేంద్ర మోదీల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేయడాన్ని ఖండించండి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్లెపల్లి తోగు అడవుల్లో, కొమురం భీమ్, (అసిపాబాద్) జిల్లా తొక్కగుడా అడవులల్లో మా దళాలపై గ్రేహౌండ్స్ బలగాలతో దాడులు చేయడాన్ని, ప్రజలను అరెస్టు చేయడాన్ని, ప్రజలు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించండి. ఉపా, ఎన్ ఐ ఏ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.
జూలై /15వ తారీకున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మల్లెపల్లి తోగు గ్రామ అడవుల్లో మరియు కుమరం భీం ఆసిఫాబాద్, జిల్లా తిర్యాణి మండలం, మంగ్ ప్రాంతంలోని తొక్కగూడ అడవుల్లో వందలాది మంది గ్రహౌండ్స్, పారామిలటరీ పోలీసులు, పోలీసు ఇన్ఫార్మ‌ర్ల ద్వారా సమాచారం ఆధారంగా మా దళాలను నిర్మూలించే లక్ష్యంతో దాడులు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలు ఉమ్మడి ఆదిలాబాద్ వరకు ఏజెన్సీ ప్రాంతాన్ని, గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాన్ని గ్రహౌండ్స్,కోబ్రా బలగాలతో జల్లెడపడుతూ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ప్రహార్ పేరుతో తెలంగాణ- ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర పోలీసు బలగాలతో జాయింట్ గా జనవరి నుండి ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులలో కా॥ సృజన (ఆర్ సిఎమ్) కా॥ అభిలాష్ (కమాండర్)తో సహా 40 మంది కామ్రేడ్స్ అమరులైనారు. దండకారణ్యంలో ఈ మధ్య కాలంలో 20 మంది విప్లవ కారులను, ప్రజలను బూటకపు ఎన్‌కౌంటర్లలో హత్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తుంటే మా దళాలు, మా సంఘాలు ప్రజలను చైతన్య పరుస్తూ భౌతిక దాడులకు పాల్పడకుండా స్వీయనియంత్రణ పాటిస్తుంటే ప్రజల భాదలను పట్టించుకోకుండా లాక్ డౌన్లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతూ, అనారోగ్యాలకు, ఆకలి చావులకు గురి చేస్తూ మోడీ బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ (కేసీఆర్) ప్రభుత్వాలు ప్రజల తరపున పనిచేస్తున్న మా పార్టీని, దళాలను నిర్మూలించే లక్ష్యంతో దాడులు కొనసాగిస్తున్నాయి.
భారత దోపిడీ పాలక వర్గాలు 2022 నాటికి దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు వ్యూహాత్మక సమాధాన్ దాడిని తీవ్రతరం చేశాయి. అందులో భాగంగానే తెలంగాణలో కూడా పాశవిక అణచివేతను కొనసాగిస్తున్నారు.
కార్డన్ సెర్చ్ పేరుతో గ్రామాల చుట్టివేత, ఇండ్ల సోదాలు, అక్రమ అరెస్టులు, చిత్రహింసలు, ప్రజలను బూతులు తిట్టడం, కొంత మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చకుండా పోలీస్ స్టేషన్లలోనే చిత్రహింసలు పెడుతూ అక్కడే వుంచుతున్నారు. ఈ మధ్యకాలంలో 60 మంది వరకు సంఘ నాయకులు, ప్రజలపై అక్రమ కేసులు పెట్టి ఉపా చట్టం కింద జైళ్ళలో పెట్టారు. తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తూ రోజువారిగా పోలీసు స్టేషన్లలో సంతకాలు పెటిస్తూ వాళ్ళతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు
కుట్రలు పన్నిన బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదులు, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తున్న పలు ప్రజాసంఘాల నాయకులను అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. విడుదలైన తెలంగాణ ప్రజా సంఘం నాయకుడు నల మాసకృష్ణను ఎన్ ఐ ఏ వాళ్ళు తిరిగి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ప్రజా గొంతుకలు ప్రజాస్వామిక వాదులు వరవరరావు, సాయిబాబాలు అనారోగ్యంతో, వృద్ధాప్యంతో బాధపడుతున్నా పాలకులు వాళ్ళను జైళ్ళల్లోనే చంపివేయాలనే కుట్రతో సరైన వైద్యం అందించడం లేదు. వాళ్ళను, వాళ్ళతో పాటు జైళ్ళవున్న మరో తొమ్మిది మందిని వెంటనే విడుదల చేయాలి. ఉపా, ఎన్ ఐఏ కేసులు ఎత్తివేయాలని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పోరాడాలి.
బ్రాహ్మణీయ హిందుత్వవాదులు, హిందూ రాజ్య నిర్మాణ లక్ష్యంతోనే కోవిడ్-19 కరోనా మహమ్మారీ కలవరపెడుతున్నప్పటికీ ప్రజలపై పాశవిక దాడిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ (కేసీఆర్) ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపట్టి మరింత నియంతృత్వంగా మారింది. ప్రజల సమస్యలు పరిష్కరించలేని పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాయి. ఈ ప్రతిఘాతుక యుద్ధాన్ని ఓడించడానికి పీడిత ప్రజలందరూ ఈ రోజు కొనసాగుతున్న ప్రజావిముక్తి యుద్ధంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ప్రజలారా ప్రజల కోసం పనిచేస్తున్న దళాలను కంటికి రెప్పలా కాపాడుకోండి. ప్రజలపై, దళాలపై దాడులు ఆపకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు ప్రజల చేతిలో శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాం. ప్ర‌జలారా, ప్రజాస్వామిక వాదులారా! ప్రజల కోసం పని చేస్తున్న దళాలపై టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్న దాడులను ఖండించండి. అడవుల నుండి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం.
విష్ణనాభినందనలతో
జగన్
అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ

Post a Comment

0 Comments