About Me

వరవరరావు ను విడుదల చేయించేందుకు సి ఎం కెసిఆర్ చొరవ చూపాలి...మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య


విరసం నేత వరవరరావు ను జైలు నుండి విడుదల చేయించేందుకు చొరవ చూపాలని కోరుతూ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సి ఎం కెసి ఆర్ కు లేఖ రాసారు.

తేదీ 15.07.2020, హైద్రాబాద్.

గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రగతి భవన్, హైదరాబాద్, తెలంగాణ గారికి..

విషయం... ప్రముఖ కవి, రచయిత, విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ను విడుదల చేయడం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం విషయమై మనవి.

సర్,
నాకు అత్యంత సన్నిహితులు, తెలంగాణ వాది, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాటం చేసిన ప్రముఖ కవి, రచయిత పెండ్యాల వరవరరావు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.

బీమాకోరేగావ్‌ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన ప్రముఖ పౌర హక్కుల నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్న వరవరరావుకు మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆయన మన తెలంగాణకు చెందిన విప్లవ కవి. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది.

నేను ఈ విషయపైన మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పోలీస్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేయడం జరిగింది. ఈ కేసును కేంద్ర ప్రత్యేక బృందం విచారణ జరుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో లేదని చెప్పారు.

అందువల్ల మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారితో, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారితో మాట్లాడి వరవరరావు ను జైల్ నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నాము.

ఆయన ఆరోగ్యం చాలా క్షిణించింది. ఆయన 80 ఏళ్లకు పైబడి వయోభారంతోను అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకొని వరవరరావు ను జైల్ నుంచి విడుదల అయ్యేలా చూసి ఇంటి వద్దనే విచారణ జరిగేలా చూడాలని కోరుతున్నాను.

ఇట్లు
మీ

పొన్నాల లక్ష్మయ్య.
మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి

Post a Comment

0 Comments