About Me

తన చావుకు టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే కారణమంటూ గొంతు కోసుకున్న వ్యక్తి

పరిస్థితి విషమం - ఆసుపత్రికి తరలించిన పోలీసులు

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండ పట్టణంలో  సుబేదారిలోని తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం వద్ద మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కల కలం రేపింది. చాకుతో గొంతు కోసుకుని రక్తం మడుగులో పడి ఉన్న వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.గొంతుకోసుకున్న వ్యక్తిది నెక్కొండ మండలం అలంకాని పేట గ్రామ మని అతని దగ్గర లభించిన సూసైడ్  నోట్ లో ఉంది.తన చావుకు కారణం..పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే అని సూసైడ్ నోట్ లో రాసి ఉంది.తన పేరు మాసం వెంకటేశ్వర్లు భార్య పేరు సావిత్రని వివరాలు ఉన్నాయి.అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ ను సూసైడ్ నోట్ లో కోరాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గొంతుకోసుకున్న వ్యక్తి విషయంపై స్థానిక మీడియా ప్రతినిధులు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని వివరణ కోరగా అసలు ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని అన్నారు.
ప్రస్తుతం వెంకటశ్వర్లు పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని చికిత్స జరుగుతోందని వైద్యులు తెలిపారు.

Post a Comment

0 Comments