About Me

కోర్టు తీర్పులను అమలు పరచండి.. మా పందులను కాపాడండి..ఎరుకల హక్కుల పోరాట సమితిమా పందులను ఎత్తుకె ల్లొద్దు
 మా జీవితాలతో ఆడుకోవద్దు


            మా పందులు  కాపాడాలంటు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ములుగు జిల్లా కమిటీ అధ్వర్యంలో సోమవారం ( 22 -6 -2020 )న  ఆందోళన నిర్వహించి  అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కెతిరి క్రాంతి కుమార్ ఎరుకల
ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ 
 రెండు దశాబ్దాల క్రితం 1997 సంవత్సరంలో నాటి అగ్రకుల దోపిడి ప్రభుత్వం పందులపై నిందారోపణలు చేస్తూ విచక్షణారహితంగా పందులను చంపేస్తున్న క్రమంలో ఎరుకల హక్కుల పోరాట సమితి వేలాది మంది ప్రజలతో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర హైకోర్టులో కేసును వేసి పోరాడితే న్యాయస్థానం  పందుల పెంపకం దారులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో  పందులను కాపాడుకున్నామన్నారు.
అయితే అప్పటికే ప్రభుత్వం చంపేసిన లక్ష పందులకు నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించలేదని  హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు అమలు జరపలేదని అన్నారు.
 పందులే జీవనాధారం అయిన ఎరుకల ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారని అటు తర్వాత తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఎరుకల జాతి ప్రజలు ప్రభుత్వాలు మారితే అగ్రకుల దోపిడి ప్రభుత్వాల ఆధిపత్యం తగ్గుతుందని భావించారని 2014 సంవత్సరంలో  ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడినా ఎరుకల తెగ ప్రజల బ్రతుకులలో ఎలాంటి మార్పులను ప్రభుత్వం తీసుకు రాలేక పోయిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దేశ వాలి పందుల పై  ప్రభుత్వాల  దమనకాండ కొనసాగుతున్నదని విమర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోణ వైరస్ మహమ్మారి ద్వారా ప్రజలు  రోగ పీడితులై వైద్యం కోసం పరుగెడుతున్న  పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో పాలకులుగా కొనసాగుతున్న దోపిడి అగ్రకుల ప్రభుత్వాలు  పందుల పై యుద్ధాన్ని ప్రకటించాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన తెగలలో ఎరుకల తెగ ఒకటి ఉన్నదని వాళ్లు కూడా  మనుషులే నని వాళ్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి అని గుర్తించడంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని అన్నారు.
 ఈ క్రమంలోనే ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ఎరుకల ప్రజల జీవనోపాధిని కాపాడడంలో ముందు బాగాన ఉం డి పోరాడుతున్నదని
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాలలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని కడప  నగరంలో పందులను పెంచుకుని జీవించే ఎరుకల ప్రజలపై మున్సిపల్ అధికారులు ఏ విధంగా దాడులు కొనసాగించారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ములుగు పట్టణ కేంద్రంలో ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు పందులను తొలగించడం జరిగిందని అన్నారు.
 పందులను కాపాడాలని ఎరుకల హక్కుల పోరాట సమితి ములుగు జిల్లా అధ్యక్షుడు కూరాకుల అశోక్ కుమార్ ఎరుకల నాయకత్వంలో ములుగు అధికారులను కలిసి  హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచాలని కోరడం జరిగిందని తెలిపారు.
 ఇందుకు స్పందించిన ఎమ్మార్వో త్వరలోనే ములుగు పట్టణంలో పందులను పెంచుకునే విధంగా ఎరుకల ప్రజలందరికీ స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కెతిరి క్రాంతి కుమార్ ఎరుకల
 ఆలిండియా ఎరుకల ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ కూరాకుల సమ్మన్న ఎరుకల భూపాలపల్లి జిల్లా ,ములుగు జిల్లా లకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments