About Me

నవంబర్ వరకు ఉచిత రేషన్. . ప్రధాన మంత్రి నరేంద్ర మోది

దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోది

కరోనా తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో ప్రధాన  మంత్రి నరేంద్ర మోది దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించారు.
క‌రోనా కు వ్యతిరేకంగా పోరాడుతూ ఇప్పుడు మ‌నం అన్‌ లాక్ రెండో దశలో ప్రవేశించాం.. మాన్‌సూన్ సీజ‌న్‌ లో వ్యాధులు కూడా పెరుగుతాయి..ఇలాంటి ప‌రిస్థితుల్లో దేశ ప్రజలు త‌గిన జాగ్రత్తతతో ఉండాలని కోరారు.
' క‌రోనా మృత్యు రేటు ప్రపంచ దేశాల‌తో పోలిస్తే మనం మెరుగ్గా ఉన్నాం. లాక్ డౌన్‌ చ‌ర్యలతో ల‌క్షలాది మ‌ర‌ణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.. అన్ లాక్ 1 ద్వారా వ్యక్తి గత బాధ్యత రాహిత్యం నిర్లక్ష్యం పెరిగి పోయిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ స‌మ‌యంలో మాస్క్‌ దరించడం,రెండు గ‌జాల దూరం ఉండడం,చేతులు క‌డ‌గ‌డం వంటి జాగ్రత్తలతో  చాలా అప్రమత్తంగా ఉన్నాం..కానీ ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తగా  ఉండాల్సిన స‌మ‌యంలో నిర్లక్ష్యం వహించడం తగదని అన్నారు.లాక్ డౌన్ వేళ సీరియ‌స్‌ గా నియ‌మాల‌ను పాటించాం. ఇప్పుడు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కంటెన్మెంట్ జోన్లలో జాగ్రత్తలు తీసుకోవాలి..నియ‌మాలు పాటించ‌ని వారిని క‌ట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.పాశ్చాత్య దేశాల్లో ఒక దేశ ప్రధాని పై రూ.13 వేల జ‌రిమానా విధించ‌డం మ‌నం ప‌త్రిక‌ల్లో చూశాం. మ‌న దేశంలో కూడా ఇలాంటి విధాన‌మే అమ‌లు చేయాలి.స‌ర్పంచ్ కానీ, దేశ ప్రధాని కానీ ఎవ్వరూ కూడా నియ‌మాల‌కు అతీతం కాదు..దేశం లోని రైతులు,ప‌న్ను చెల్లింపు దారుల‌ను కృత‌జ్ఞతలు తెలియ‌ చేస్తున్నాం.. రానున్న రోజుల్లో పేద‌, అణ‌గారిన వ‌ర్గాల‌ను ఆదుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం. ఆత్మ నిర్భర భారత్‌ ను అమ‌లు చేయ‌డానికి రేయింబ‌వ‌ళ్లు కృషి చేస్తాం. అంద‌రూ ఆరోగ్యంగా ఉండాలి. రెండు అడుగులు దూరం పాటించాలి. మాస్క్‌ లు ధ‌రించాలి'అని ప్రధాని అన్నారు.
స‌మ‌యానుసారంగా,నిర్ణయాలు తీసుకోవ‌డం వ‌ల్ల సంక‌ట స్థితి ఎదుర్కొనే శ‌క్తి అనేక రెట్లు పెర‌గు తుంది..లాక్ డౌన్ వేళ ప్రభుత్వం పీఎం గ‌రీభ్ క‌ళ్యాణ్ యోజ‌న తీసుకు వ‌చ్చింది..గ‌త మూడు నెల‌ల్లో 20 కోట్ల పేద‌ల జ‌న్‌ ధ‌న్ ఖాతాల్లో 31వేల కోట్ల రూపాయ‌లు జ‌మ చేయించాం. 9 కోట్ల కు పైగా రైతుల ఖాతాల్లో 18 వేల కోట్ల రూపాయ‌లు జ‌మ చేశాం. గ్రామాల్లో శ్రామికుల‌కు ఉపాధి క‌ల్పించే ప్రక్రియ వేగ‌ వంతం చేశామన్నారు. దీని కోసం ప్ర్రభుత్వం 50 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోందని, 80 కోట్ల మందికి పైగా కుటుంబాల‌లలో అందరికి రేష‌న్ బియ్యం,గోధుమ‌లు ఉచితంగా పంపిణీ చేయ‌డం జ‌రిగిందని,ఒక కిలో ప‌ప్పు కూడా ఉచితంగా ఇచ్చామని , బ్రిట‌న్‌,యూరోప్ జ‌నాభా తో పోలిస్తే ఎక్కువ మందికి ఉచితంగా ఆహారాన్ని అంద‌జేశామని పేర్కొన్నారు.

మాన్‌సూన్ సీజ‌న్‌ లో వ్యవసాయ‌రంగం లో ఎక్కువగా ప‌నులు ఉంటాయి. జూలై 5 నుంచి పండుగ‌ల సీజ‌న్ మొద‌ల‌వ్వనుంది.పండుగ‌ల సీజ‌న్‌ లో ఆర్ధిక అవ‌స‌రాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న ప‌థ‌కాన్ని న‌వంబ‌ర్ చివ‌రి వారం వ‌ర‌కు పొడిగించ‌డం జ‌రిగింది. 80 కోట్ల మందికి ఉచిత రేష‌న్ పంపీణీ న‌వంబ‌ర్ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నుంది. కేంద్రం ద్వారా ఈ ఐదు నెల‌ల పాటు 80 కోట్లకు పైగా పేద‌ కుటుంబాల లోని ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం, లేదా గోధుమ‌లు ఉచితంగా ఇవ్వడం జ‌రుగుతుంది అని అన్నారు. ప్రతి ఒక్కరికి పప్పు ఇస్తామని  దీని వ‌ల్ల 90 వేల కోట్లు ఖ‌ర్చు అవుతుందని అన్నారు.గ‌త మూడు నెల‌ల కాలం పాటు ఇస్తున్న సరుకులతో కలిపితే 1.50 ల‌క్షల కోట్లు అవుతాయని అన్నారు.యావ‌త్ భార‌త్ దేశంలో ఎక్కడైనా ేషన్ కార్డు చెల్లుబాటు అయ్యే విధంగా వన్ రేష‌న్ - వ‌న్ నేష‌న్ కార్డు విధానం అమ‌లు కానుందని అన్నారు.

Post a Comment

0 Comments