About Me

లయన్స్ క్లబ్ ల సేవలు శ్లాఘనీయం:జిల్లా కలెక్టర్ నిఖిల

 కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తున్న విపత్కర పరిస్థితులలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ వారు తమ వంతు సాయంగా అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని జిల్లా కలెక్టర్  కే. నిఖిల అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో  లయన్స్ జిల్లా గవర్నర్ పొట్లపల్లి శ్రీనివాస్ రావు నిర్దేశానుసారం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ( *ఎల్.సి.ఐ.ఎఫ్* )నుంచి మంజూరైన నిధుల నుండి జనగామతో పాటు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాలలో పి.పి. ఇ. కిట్లు, థర్మల్ స్కానర్లు, ఎన్95 మాస్క్లు, సానిటైజర్స్ జనరల్ మాస్కూలూ జనగామ కు సంబంధించినవి జిల్లా వైద్యాధికారి మహెందరుకు కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు సేవలు అందించే వైద్య సిబ్బందికి, అధికారులకు రక్షణ కల్పించేందుకు లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా జిల్లా అధికారులకు అవసరమయ్యే పరికరాలను అందించడం హర్షణీయమన్నారు. అనంతరం పూర్వ జిల్లా గవర్నర్ డా. డి. లవకుమార్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఎల్.సి.ఐ.ఎఫ్. నిధుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పది లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను అందించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఈ పరికరాలను అందించినట్లు తెలిపారు.
     ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్యాధికారి డాక్టర్ మహేందర్, రీజియన్ చైర్ పర్సన్ లు డా. Ch. రాజమౌళి, అడ్వకేట్ బిక్షపతి, జిల్లా అధికారులు, పి.ఆర్. ఓ. ప్రేమలత, లయన్స్ నాయకులు సెకండ్ వైస్ జిల్లా గవర్నర్ ఎలెక్ట్ కన్న పరశురాములు, జిల్లా అడ్మినిస్ట్రేటర్ చంద్రగిరి ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments