About Me

బిఎస్ఎన్ఎల్ అధిరిపోయే ప్రిపెయిడ్ ఆఫర్లు

BSNL 
ప్రభుత్వరంగ టెలికం సంస్థ తన కస్టమర్ల కోసం తాజాగా పలు ఆఫర్లు తీసుకొచ్చింది.. కరోనా లాక్‌డౌన్‌తో క్రమంగా డేటా వినియోగం పెరిగిపోవడంతో.. టెలికం సంస్థ మొత్తం ఇప్పుడు డేటా ప్యాక్‌లపై దృష్టిసారిస్తున్న సమయంలో.. అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్‌. కొత్తగ రూ. 1,498 ప్లాన్‌ను తీసు కొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్.. ఈ ప్లాన్ ద్వార వినియోగదారులకు 91 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తోంది.. డేటా వ్యాలిడిటీ 365 రోజులగా పెట్టింది.. ఇక, మరి కొన్ని డేటా వోచర్లను కూడా విడుదల చేసింది బీఎస్‌ఎన్‌ఎల్.. రూ. 96 డేటా వోచర్‌తో 11 జీబీ డేటాను అందివ్వనున్నారు.. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇక, రూ. 48 ప్లాన్‌తో 5 జీడీ డేటాను పొందవచ్చు.. డేటాతో పాటు ఈ వోచర్స్ ద్వారా అద్బుతమైన ఓటీటీ సర్వీసులను కూడ అందిస్తున్నారు. మీకు సబ్ స్క్రిప్షన్ ప్లాన్లు కావాలను కుంటే మీరు రూ.98 డేటా వోచర్ వేసు కోవచ్చు.. దీనితో రోజుకు 2 జీబీ డేటా 20 రోజులు వ్యాలిడిటీతో పొందవచ్చు. అయితే, దీంతోపాటు ఎరోస్ నౌ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. అలాగే, రూ. 198 ఎస్టీవీ కూడా రోజుకు 2 జీబీ డేటాను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. మరోవైపు రూ.247 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, అన్ లిమిటెడ్ కాలింగ్‌ సదుపాయం ఉంది. దీని వ్యాలిడిటీ 30 రోజులుగా నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ సర్కిళ్లలో రూ.228, రూ.268 ప్లాన్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. 
ఇక, కేవలం రూ .2 చెల్లించడం ద్వారా వాలిడిటీ ఎక్స్‌టెన్షన్ పొందవచ్చు.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్యాక్ ప్రస్తుతం ఉన్న రూ .19 వాలిడిటీ ఎక్స్‌టెన్షన్ ప్యాక్ యొక్క సవరించిన వెర్షన్. రూ .2 రీచార్జ్‌తో మూడు రోజుల గ్రేస్ పీరియడ్‌ను పొందవచ్చు.. బీఎస్‌ఎన్‌ఎల్ తమిళనాడు విభాగంలో కొత్త ప్యాక్‌ని ప్రకటించారు. మీరు ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ చివరి రోజున మీ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌ను రూ .2 తో రీఛార్జ్ చేస్తే, మీ నంబర్‌ను మళ్లీ రీఛార్జ్ చేయడానికి మీకు మరో మూడు రోజులు ఇవ్వబడుతుంది. వార్షిక ప్రణాళిక మరియు రెండు త్రైమాసిక ప్రణాళికలతో సహా ఆలస్యంగా కొత్త ప్రీపెయిడ్ ప్రణాళికలను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. రూ .699, రూ .786, రూ .2,399 ఫ్లాన్లు అందుబాటులోకి తెచ్చింది.. బీఎస్‌ఎన్‌ఎల్ 2,399 రూపాయల వార్షిక ప్రణాళికలో ప్రీపెయిడ్ ప్లాన్ 600 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రూ .2,399 ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 60 రోజుల పాటు ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్ ఉన్నాయి. 

Post a Comment

0 Comments