About Me

మానవతప్పిదం వల్లే ఎల్జీపాలిమర్స్‌ ఘటన - ఎన్జీటీకి శేషశయనారెడ్డి కమిటీ నివేదిక


న్యూఢిల్లీ : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనకు మానవ తప్పిదమే కారణమని రిటైర్డ్‌ జడ్జి శేషశయనారెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జిటి)లో ఈ అంశంపై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ శేషశయనారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక సమర్పించింది. మానవతప్పిదంతోపాటు భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమని ఈ కమిటీ తేల్చింది. ఈ ప్రమాదం కారణంగా 16 మంది చనిపోయారు. ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారు. కాగా ఎల్జీ పాలిమర్స్‌ తరుపున లాయర్‌ సిద్దార్ధ వాదిస్తూ ఎన్జీటీకి ఈ కేసును సుమోటోగా తీసుకొని వాదించే అధికారం లేదని అన్నారు. ఈఎఎస్‌ శర్మ తరుపున లాయర్‌ వాదిస్తూ 2001 నుంచి ఈ కంపెనీకి అనుమతులు లేకపోయినా నడిపిస్తోందని తెలిపారు. వాదనలు విన్న ఎన్‌జీటీ ధర్మాసనం నివేదికను పరిశీలించాక లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.




Post a Comment

0 Comments