About Me

పదవ తరగతి పరీక్షలు వాయిదా

Class 10 exams postponed 

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పును అనుసరించి పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై త్వరలో సీఎం కేసీఆర్‌తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించవచ్చని ఇవాళ సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వారం రోజులకు ఒకసారి పరీక్ష కేంద్రాల వద్దర పరిస్థితిని సమీక్షించాలని స్పష్టం చేసింది. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు అయినట్లయితే అక్కడ కూడా వాయిదా వేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలపై విద్యాశాఖ సుదీర్ఘంగా చర్చించింది.

Post a Comment

0 Comments