About Me

భల్లాలదేవుడి పెళ్లికి మూడు రోజుల వేడుకలు

Daggubati Rana and Mihika Bajaj

'బాహుబలి'ఫేమ్ భల్లాల దేవుడు - రానా దగ్గుబాటి తన ప్రియురాలు మిహికా బజాజ్‌తో జరగనున్న వివాహ ముహుర్తం ఖరారు చేసారు.ఆగస్ట్ 8 వ తేదీన వివాహం తేది నిశ్చయించినట్లు రానా తండ్రి దగ్గు బాటి సురేష్ బాబు తెలిపారు. మూడు రోజుల పాటు రామానాయుడు స్టూడియోలో  వివాహ వేడుకలు జరగనున్నాయి. పెళ్ళికి ముందు 6,7 తేదీలలో  ప్రివెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు.
లాక్ డౌన్ లో రానా,మిహికా ఒక్కటవుతున్నారు.వీరి నిశ్చితార్దం  మె నెల మొదటి వారంలో జరిగింది, నిశ్చితార్దం పూర్తి అయిన తర్వాత చిత్రాలను మీడియాకు విడుదల చేసారు. పెళ్లి అనంతరం కూడ వీడియోలు ఫోటోలు మీడియాకు విడుదల చేయనున్నారు.
 కరోనా నిభందనలు పాటిస్తూనే  ఇరు వైపులా ముఖ్యమైన భందువల సమక్షంలో వివాహ వేడుకలు జరుగుతాయని సురేష్ బాబు తెలిపారు.
‘పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే జరుగుతాయి.పెళ్లికి 80 నుంచి 100 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. కానీ ఆగస్టు సమయానికి పరిస్థితులు మారిపోవచ్చు. ప్రభుత్వ నియమాల్లో కొన్ని సడలింపులు ఉండవచ్చు. అలా జరిగినట్లయితే విదేశాల్లో ఉన్న మా బంధుమిత్రులు ఈ వివాహ వేడుకకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వెడ్డింగ్‌ థీమ్, డెకరేషన్‌ వంటి వాటిపై వర్క్‌ జరుగుతోంది. కానీ కరోనా నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి ప్రభుత్వ నియమాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే మా ప్రయత్నంలో భాగంగా మేం ప్లాన్‌ ఎ,ప్లాన్‌ బి, ప్లాన్‌ సీలను రెడీ చేస్తున్నాం’’ అని మిహికా బజాజ్‌ తల్లి బంటీ బజాజ్‌ పేర్కొన్నారు.
ఇంతకి మిహికా హైదరాబాద్ అమ్మాయే నట. ఆమె తల్లి దండ్రులు సోదరుడు హైదరాబాద్ లోనే ఉంటున్నారు.వారిది బంగారు నగల వ్యాపారం.కాసలా - Krsala బ్రాండ్ నేమ్ షో రూం వారిదే.
ఇక మిహికా స్కూలింగ్ అంతా హైదరాబాద్ లోనే జరిగింది. అయితే మిహికా హైదరాబాద్ లో ఉన్నపుడు దగ్గు బాటి రానా పరిచయం లేదు.
ఇంటీరియర్ డిజైనర్ ఈవెంట్ మేనేజ్ మెంట్ ఎక్స్ పర్ట్ అయిన మిహికాతో దగ్గు బాటు రానా డేటింగ్ ఏడాది కాలం పాటు గోప్యంగా కొనసాగింది.వారి నిశ్చాతార్దం జరిగేంత వరకు మీడియాతో సహా ఎవరికి తెలియక సంభ్ర మాశ్చర్యాలకు లోనయ్యారు.
మిహికాలో తనకు నచ్చే విషయాలు చాలా ఉన్నాయని రానా తెలిపారు.తన లాగే అందరితో కలుపుగోలుగా ఉండే మనిషని రానా తెలిపారు.

Post a Comment

0 Comments