About Me

జర్నలిస్టులను ఆదుకోండి...ముఖ్యమంత్రికి మీడియ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ లేఖ



తెలంగాణ న్యాయవాదులను ఆదుకున్న విధంగానే తెలంగాణ జర్నలిస్టులకు 25 కోట్ల తక్షణ సహాయం
అంద చేయాలి
గుర్తింపు కలిగిన ప్రతి జర్నలిస్టుకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలి
 జర్నలిస్టుల సంక్షేమ నిధికి 65.50 కోట్ల రూపాయలను నిధుల విడుదల చేయాలి 

తెలంగాణ న్యాయ వాదులను ఆదుకున్న విధంగానే తెలంగాణ జర్నలిస్టులకు 25 కోట్ల తక్షణ సహాయం ప్రకటించి ఆదు కోవాలని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రికి  లేఖ రాసారు. గుర్తింపు కలిగిన ప్రతి జర్నలిస్టుకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అందు కోసం తగిన మార్గదర్శ కాలు రూపొందించాలని కోరారు. ప్రెస్ అకాడమీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకావాలని కోరారు. అకాడమీకి రూ 100కోట్ల నిధులు ప్రకటించారని ఇప్పటి వరకు రూ 35 కోట్లు మాత్రమే విడుదల చేసారని మిగతా నిధులు విడుదల చేయాలని కోరారు.

మీడియా యాజమాన్యాలు జర్నలిస్టులను మద్యంతరంగా ఆకారణంగా తొలగించడం,జీతభాత్యాల్లో  కోత విధించడం వంటి చర్యలకు పూనుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
యాజమాన్యాలు ఎలాంటి నోటీసులు లేకుండా ఉద్యోగులను తొలగించడం,కనీసం నష్ట పరిహారం చెల్లించకుండా కార్మిక చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని  అందువలన మీడియా సంస్థలలో పని చేస్తున్న జర్నలిస్టుల విషయంలో కార్మిక చట్టాలను ఖఠినంగా అమలు చేయాలని  ప్రతి జర్నలిస్టు కు  కరోనా న్యూస్ కవరేజీలో పూర్తి రక్షణ  ఉండే విధంగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.అందు కోసం ప్రతి జర్నలిస్టుకు కరోనా కిట్ (మాస్క్, సానిటైజర్, పి.పి.ఇ. కిట్, గ్లౌజ్) సరఫరా చేయాలన్నారు. ప్రతి జర్నలిస్టులకు 20 లక్షల ప్రమాద భీమా వర్తింప జేయాలని, కంటైన్మెంట్, రెడ్ జోన్ వంటి ప్రాంతాలలో  విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు విధిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు.
జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డుల పై  కార్పోరేట్ ఆసుపత్రులలో   ఉచిత వైద్య పరీక్షలు, వైద్యం అందే విధంగా ఆదేశాలు జారి చేయాలని కోరారు. చిన్నపత్రికలకు ఏడాది కాలంగా ఒక్క ప్రకటన కూడ విడుదల కాక పత్రికలుసంక్షోభంలో పడ్డాయిని ప్రభుత్వంవాటిని ఆదుకోవాలని కోరారు.హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యక్రమాలు యధా విధిగా కొనసాగించేందుకు 50 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ మంజూరు చేయాలనికోరారు.

Post a Comment

0 Comments