About Me

రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆరవ  ఆవిర్భావ దినోత్సవాలు రాష్ర్ట వ్యాప్తంగా జరిగాయి.ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గన్ పార్కు వద్ద అమర వీరుల స్మారక స్థూపంవద్ద అమర యోధులకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి జాతీయ పతాకం ఆవిష్కరించారు.  తెలంగాణ భవన్ లో టిఆర్ ఎస్ పార్టి  పార్లమెంటరి నేత కేశవరావు జాతీయ జెండా ఎగుర వేశారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.సిరిసిల్ల రాజన్న జిల్లా కేంద్రంలో మంత్రి కెటిఆర్  వేడుకల్లో పాల్గొన్నారు.వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండా ఎగుర వేసి అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

Post a Comment

0 Comments