About Me

లొంగిపోయిన మావోయిస్టు దంపతులకు ఆర్థిక సాయం


నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన మవోయిస్టు దంపతులకు ఆర్థిక సాయాన్ని అందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్.

జనజీవస్రవంతిలో కల్సిన మావోయిస్టులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంలో భాగంగా గత మార్చ్ 21వ తేదిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ దంపతులైన గండ్రకోటి మల్లేశం ఆలియాస్ కిరణ్ కు 5లక్షలు, చింత శ్రీలత ఆలియాస్ హైమ 4లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం అందించారు. పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందుకున్న మావోయిస్టు దంపతులు ఇరువురు మావోయిస్టు పార్టీలో 2004 సంవత్సరం నుండి వివిధ హోదాల్లో ఛత్తీస్మడ్, ఒడిషా, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో పనిచేసి పార్టీ సిద్ధాంతాలు నచ్చక పోవడంతో పాటు ప్రజల్లో పార్టీ పట్ల సానుభూతి తగ్గడంతో పార్టీ వీడి జనజీవన స్రవంతిలో కలిసారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అజ్ఞాతంలో వున్న మావోయిస్టులు జనజీవన స్రవంతి కల్సి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో నూతన జీవితాన్ని ప్రారంభించచడంతో పాటు, తెలంగాణ అభివృద్ధిలో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఓఎస్టీ తిరుపతి, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ రవికిరణ్ పాల్గొన్నారు.


Post a Comment

0 Comments