About Me

విప్లవ కవి, రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలి TUWJ(TJF)

     సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉంటూ పేద ప్రజలు, పీడిత ప్రజల పక్షాన నిలిచి, ప్రజా పోరాటాలకు మద్దతుగా నిలబడి, రచనలు చేస్తున్న కవి, రచయిత వరవరరావు పై కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.  అండర్ ట్రయిల్ పేరుతో వరవరరావు ను 18 నెలలుగా జైలులో పెట్టి కుటుంబ సభ్యులను కూడా కలనివ్వకపోవడం రాజ్యాంగం ప్రకారం ఖైదీలకు ఉన్న హక్కులను హరించి వేయడమే. 80 ఏళ్ల వయస్సు ఉన్న వరవరరావు ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆయన భార్య కూతుర్ల విజ్ఞప్తి మేరకు, జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వమే జారీ చేసిన COVID-19 నిబంధనల ప్రకారం అయినా ముంబై జైలులో ఉన్న వరవరరావు ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ-TJF) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, TEMJU రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు,TUWJ హైద్రాబాద్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.యోగనంద్, యార నవీన్ కుమార్, తెంజు హైద్రాబాద్ నగర అధ్యక్షుడు జి.సంపత్ లు డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments