About Me

విరాఠ పర్వం ఫస్ట్ పోస్టర్ విడుదల


తెలంగాణ ప్రాంతంలో 1990 ప్రాంతంలో ఉదృతంగా కొనసాగిన నక్సలైట్ల ఉద్యమం  ఇతివృత్తంగా రూపుదిద్దుకుంటున్న విరాఠపర్వం చిత్రం సినిమా నిర్మాణం దాదాపు పూర్తి అయింది. దగ్గుబాటి రాణా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మొదటి పోస్టర్ ను దగ్గుబాటి రాణా సోషల్ మీడియా వేదికగా సాయిపల్లవి పుట్టిన రోజు శనివారం విడుదల చేశారు.
గ్రామీణ ప్రాంత యువతి అలంకారం...పక్కనే ఓ లగేజి బ్యాగు... అమర వీరుల స్మారక స్థూపం దగ్గర కూర్చుని  ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లున్న దృశ్యం సినిమా నేపధ్య మేమిటో అర్దం చేసుకునే రీతిలో ఉంది.ఈ పోస్టర్ చూడగానే సినిమా కథ ఎలా ఉండబోతోందో చెప్పవచ్చు. సక్సెస్ ఫుల్  డైరెక్టర్ వేణు ఉడుముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కరోనా లాక్ డౌన్ లేక పోయి ఉన్నట్లు అయితే ఈ పాటికి విడుదల కావల్సింది.అన్ని పనులు పూర్తి అయ్యాయని లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేస్తే విడుదల తేదీని అనౌన్స్ చేస్తారని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఈ సినిమాలో హిది ఫేమ్ యాక్టర్ జరీనా వాహబ్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ప్రియమని, నందితాదాస్,ఈశ్వరి రామ్, సాయిచంద్ తదితరులు నటించారు.
విప్లవోద్యమాల నేపద్య సినిమాలు గతంలో అనేకం వచ్చాయి.ఎర్ర సినిమాలు బాగానో జనాలలో చొట్టుకు పోయాయి. అయితే ఆ నాటి పరిస్థితులు ప్రస్తుతం తనిపించటం లేదు. ప్రస్తుతం నక్సలైట్ల ఉద్యమం సెట్ బాక్ అయిన కాలంలో ఈ సినిమా కథ ఏమిటో ఏ ఏ అంశాలకు ముడి పెట్టారో చూడాలి.

Post a Comment

0 Comments