About Me

శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

 ప్రముఖ టీవీ ఛానెల్,యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.బ్రాహ్మణులను బిగ్ బాస్ షోలో శ్రీముఖి అవమానపరిచిందని  నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి  ఫిర్యాదు చేశాడు.కాగా ఈ కేసుపై యాంకర్ శ్రీముఖి స్పందించింది. తనకి ఏ వర్గాన్ని కించపరిచే ఉద్ధేశ్యం లేదని, సమాజంలో అన్ని వర్గాలకు తానూ సమాన గౌరవం ఇస్తానని చెప్పింది శ్రీముఖి. తనపై నమోదైన కేసు చూసి షాక్ అయ్యానని పేర్కొంది. ఈ విషయంలో పోలీసులకు అన్ని విధాలుగా సహకరించడానికి తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పింది. అయితే తెలిసో తెలీకో తాను తప్పుు చేసి ఉంటే సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది శ్రీముఖి. అలాగే 2018లోనే ఆ షో ముగిసిపోయిందని.. తొలిసారి ప్రసారమైనప్పుడు కంటెంట్ మీద ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఎవరు? ఎందుకు? కేసు వేశారో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఆ షోలో ఏ వీడియో క్లిప్ మీద వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తనకు తెలీదని తెలిపింది. ఏదేమైనా.. తెలిసో తెలీక తప్పు చేసివుంటే వారికి క్షమాపణలు చెప్పడానికి రెడీ అని పేర్కొంది శ్రీముఖి.

Post a Comment

0 Comments