About Me

పట్నం లనే కరోనా పరేషాన్

తెలంగాణ రాష్ర్టంలో కరోనా కేసులు నియంత్రణలో కనిపిస్తున్నా రాష్ర్ట రాజధాని  హైదరాబాద్ లో  కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ర్టంలో మే 1 నాటికి 1,044 కేసులు నమోదు కాగా ఇందుల ోఅధిక శాతం హైదరాబాద్ లో నే ఉన్నాయి. హైదరాబాద్  రెడ్ జోన్ పరిదిలో ఉంది.ఒక వేళ లాక్ డౌన్ ముగిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. లాక్ డౌన్  మే నెల 17 వరకు కేంద్రం పొడిగించింది.  రాష్ర్ట ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మే నెల 7 తో ముగుస్తుంది. అయితే కేంద్రం విధించిన లాక్ డౌన్ విధిగి ఆమలు చేయాల్సి ఉండటం వల్ల 17 వరకు పొడిగించక తప్పదు. అప్పటి వరకు కేసులు తగ్గు ముఖం పట్టక పోతే ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 464కి పెరిగింది. ఇక 552 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 28 మంది మరణించారు.

రాష్ర్టంలో ఇతర జిల్లాలలో ఆరు జిల్లాలు కేంద్రం ప్రకటించిన రెడ్ జోన్ల జాబితాలో ఉన్నా హైదరాబాద్ మివహా ఇతర జిల్లాల పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. జిల్లాలలో కొత్తగా కేసులు నమోదు కావడం లేదు.  గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోనే కేసులు నమోదు అవుతున్నాయి.

Post a Comment

0 Comments