About Me

అఘోరా గా బాలయ్య

దర్శకుడు బోయపాటి శ్రీను, సినీనటుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రానున్న కొత్త సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపించ బోతున్నారు.దీనిపై స్పందించిన బోయపాటి కూడ  స్పష్టతనిచ్చారు.బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నారని తలిపారు. ఈ కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కరోనా విజృంభణతో లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్‌కు కూడా విరామం వచ్చింది. బాలయ్య అభిమానులకు మరోసారి మంచి సినిమాని అందిస్తానని బోయపాటి వ్యాఖ్యానించారు.

కాగా, ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది.  అందులో ఓ పాత్రే అఘోరా అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య కవలలుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారని, చిన్నతనంలోనే వారిద్దరు వేరు అయి ఒకరు వారణాసిలో, మరొకరు అనంతరపురంలో పెరుగుతారని ఇటీవల ప్రచారం జరిగింది.

Post a Comment

0 Comments