About Me

స్వంత గడ్డపై మమకారం....ఆదివాసి గిరిజనులకు వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం తోడ్పాటు



వరంగల్ ఎన్ఆర్ ఐ ఫోరం లండన్ యు,కే  ఎన్ఆర్ ఐల తోడ్పాటు
నిత్యావసర సరుకుల  పంపిణి 

కరోనా లాక్ డౌన్ కష్ట కాలంలో తమ స్వంత గడ్డపై అవస్థలు పడుతున్న మారుమూల గ్రామాల ఆదివాసీలను ఆదుకోవాలన్న తపనతో లండన్ లో ఉంటున్న ఎన్ఆర్ ఐలు వారికి తోడ్పాటుగా  నిలిచారు. వరంగల్ ఎన్ ఆర్ఐ ఫోరం లండన్ యు.కె ఎన్ఆర్ ఐలు నిత్యావసరాలు పంపిణ చేసారు. ఫోరం ప్రెసిడెంట్ శ్రీధర్ నీల, ఫౌండర్ పసునూరి కిరణ్, ఉపాధ్యక్షులు జయంత్ వద్ది రాజు, రమణ సాదినేని, వంశి మునిగంటి, జనరల్ సెక్రెటరి పిట్టల భాస్కర్, సభ్యుడు మాడి శెట్టి భాస్కర్  నిర్ణయం మేరకు వరంగల్ లో వారి ప్రతినిధులు శనివారం ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం లోని లవ్వాల,బందాల, రంగాపూర్, కోయగూడెం, జారుబండ తదితర  గ్రామాలలో ఆదివాసీ లకు నిత్యావసరాలు పంపిణి చేశారు. 
 జిల్లా ఫోరం వరంగల్ఇన్ చార్జి బుర్రవినోద్, క్రాంతి,కిరణ్ అధ్వర్యంలో ఫోరం ప్రతినిధులు హైదరాబాద్ కు చెందిన పలువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కిరణ్ బొనగాని,చల్వాయి గ్రామానికి చెందిన బొనగాని యాదగిరి, బొనగాని యాదగిరి,అశోక్ తదితరులు పంపిణిలో పాల్గొన్నారు.
గిరిజన కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం, కూరగాయలు, ఆయిల్, సాల్ట్, పాకెట్లు పంపిణ చేశారు. ఈ సందర్బంగా ఫోరం ప్రెసిడెండ్ శ్రీధర్ నీల లండన్ నుండి ఫోన్లో మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో మారు మూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెల్సుకున్నామని తెలిపారు. ములుగు శాసన సబ్యురాలు ధనసర అనసూర్య -సీతక్క సరైన రహదారులు కూడ లేని గ్రామాలకు ఎంతో కష్ట పడుతూ వెళ్ళి గిరిజనులను ఆదుకుంటోందని తెల్సి  స్పందించిన తమ ఫోరం  తాము కూడ గిరిజనులకు తోడ్పడాలని నిర్ణయించి వరంగల్ లో ఉన్న తమ ప్రతినిధుల ద్వారా నిత్యావసరాలు పంపిణి చేయించామని చెప్పారు. ఆదివాసి గిరిజనులను ఆదుకునేందుకు తమ ఫోరం ఎల్లప్పుడు సిద్దంగా ఉంటుందని తెలిపారు. ముందు ముందు గిరిజన గ్రామాలను దత్తత తీసుకుని సంక్షేమ సేవా కార్యక్రమాలు అమలు చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు.  లాక్ డౌన్ కాలంలో ఇబ్బందులు పడుతున్న గిరిజనులను ములుగు శాసన సభ్యురాలు ధనసరి అనసూర్య - సీతక్క ఆదుకుంటున్న తీరును తమ ఫోరం అభినందిస్తున్నదని శ్రీధర్ తెలిపారు. కష్టకాలంలో ప్రజల వెన్నంటి ఉన్న నాయకులను ప్రజలు మరువ లేరని అన్నారు. వరంగల్ జిల్లాలో ప్రజా ప్రతినిదులు కరోనా లాక్ డౌన్ పీరియడ్ లో ప్రజలకు అండగా ఉంటున్నారని అభినందించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ ఎంపి పసునూటి దయాకర్ సేవలను ఫోరం తరపున అభినందిస్తున్నామని చెప్పారు.  ఆదివాసీలకు సరుకుల పింపిణీకి సహకరించిన  లండన్ వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం సభ్యులందరికి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.





Post a Comment

0 Comments