About Me

ఆగస్టు నాటికి ‘వన్ నేషన్.. వన్ రేషన్ 'నిర్మలా సీతారామన్

వలస కార్మికులకు ఎక్కడైనా కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు 
జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించే క్రమంలో వన్ నేషన్, వన్ కార్డు విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రేషన్‌ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని.. ఆగస్టు నాటికి ఒకే దేశం - ఒకే కార్డు విధానం అమల్లోకి తీసుకొస్తామని గురువారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రేషన్‌ కార్డు ఉన్న వారు ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చని, రేషన్‌ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని తెలిపారు.ఆత్మ నిర్భర అభియాన్ భారత్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలిపారు. ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తామని చెప్పారు.ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రేషన్‌ కార్డు లేనివారికి కూడ బియ్యం,గోధుమలు,పప్పు పంపిణి చేస్తారని తెలిపారు.63 కోట్ల మందికి ఈ కార్డు ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా, కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చని తెలిపారు. 

Post a Comment

0 Comments