About Me

కాంక్రీట్ మిక్సర్ లో వలస కార్మికుల ప్రయాణం..షాకింగ్

లాక్ డౌన్ లో వలస కార్మికుల గోస ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదన్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి. వెలుగు చూసినవి చాలా తక్కువ. వారి గోస వారిదన్నట్టు వలసకార్మికుల గోస వలస కార్మికులు అనుభవించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ సిమెంట్ కాంక్రీట్ మిక్సర్‌లో 18 మంది వలస కార్మికులు ప్రయాణిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కు  35 కి.మీ దూరంలో పోలీసులు అనుమానంతో ఈ వాహనాన్ని నిలిపి వేసి తనిఖి చేయగా వలస కార్మికుల ప్రయాణం వెలుగు చూసింది.కాంక్రీట్ మిక్సర్ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.వలస కార్మికులను అదుపు లోకి తీసుకుని లాక్ డౌన్ నిభందనలు అతిక్రమించి నందుకు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.
లాక్ డౌన్ అమలులో వలస కార్మికుల దీనావస్థకు ఈ సంఘటన అద్దం పడుతుంది.ఈ కూలీలంతా ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారు. పనుల కోసం మహారాష్ర్టకు వచ్చి లాక్ డౌన్ లో ఇరుక్క పోయారు.ఎట్లాగైనా  స్వస్థలాలకు చేరుకోవాలని గాలి ఆడని వాహనంలో ఓ రంద్రం గుండా దూరి అందులో కూర్చుని ప్రయాణించారు.

పోలీసులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వాహనం డ్రైవర్ పై వివిద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిని ప్రత్యేక వాహనంలో వారి స్వస్థలాలకు చేరుస్తామని పోలీసులు తెలిపారు.

వలస కార్మికుల దీనావస్థకు అద్దం పట్టే ఈ సంఘటన అనేక మందిని కదిలించింది. దృశ్య మాద్యమాలలో ఈ సంఘటన చూసిన వారంతా వలస కార్మికుల దుస్థికి ఆవేదన చెందకుండా ఉండ లేక పోయారు.లాక్ ప్రకటించిన అనంతరం దేశంలో అన్ని రాష్ర్టాలలో చిక్కుకు పోయిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పస్తులతో అలమటిస్తూనే కాలి నడకన పిల్లా పాపలను చంకన వేసుకుని నెత్తిన మూటా ముల్లెతో  వందల కిలోమీటర్లు ప్రయాణించారు. కొందరు ఈ ప్రయాణంలో చనిపోయారు.వేలాది మందిని పోలీసులు ఆయా  రాష్ర్టాల సరిహద్దుల్లో నిలిపి వేసి క్వారెంటైన్ కేంద్రాలకు తరలించారు.కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు నిరుపేద వలస కార్మికుల పట్ల ఆలోచించకుండా వారి దీనావస్థను పట్టించుకోకుండా నిభందనలు అమలు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

Post a Comment

0 Comments