About Me

నాకేకాన్సర్ లేదు...ఆరోగ్యంగా ఉన్నా అమిత్ షా


నాకేం బాగానే ఉన్నా...అమిత్ షా

హోం మంత్రి అమిత్ షా ఆరోగ్యంసరిగా లేదన ిఆన బోన్ క్నాసర్ తో భాదపడుతూ చికిత్స పొందుతున్నాని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై అమిత్ షా స్వయంగా స్పందించారు.నాకే కాన్సర్ లేదని బాగానే ఉన్నానంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట సమయంలో ఉంది. ప్రజలంతా కరోనాపై యుద్ధం చేస్తున్నారు. దేశ హోంమంత్రిగా బాధ్యతాయుతంగా నాపనిలో నేను ఉన్నాను. గడిచిన రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో నా ఆరోగ్యంపై అనేక వదంతులు వస్తున్నాయి. ఇలాంటివి ఎవరు, ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ బీజేపీ కార్యకర్తలు, నా అభిమానులు  తప్పుడు వార్తలతో మనోవేదనకు గురువ్వకూడదని భావించాను. అందుకే వారందరికీ వివరణ ఇస్తున్నాను. నేను ఎలాంటి వ్యాధితో బాధపడటంలేదు. పూర్తిగా అరోగ్యంగా ఉన్నాను’ అని తన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపారు.

Post a Comment

0 Comments