About Me

కైలాస మానససరోవర యాత్రకు తగ్గిన దూర భారం


90కిలోమాటర్ల కొత్త దారి ప్రారంభం- వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్
కైలాస మానససరోవర యాత్రకు దూరభారం తగ్గింది.దేశం నుంచి వెళ్లే భక్తుల కోసం  ఉత్తరాఖండ్‌లోని దార్చుల్లా నుంచి చైనా సరిహద్దులోని లిపులేక్ పాస్ వరకు  వేసిన 90 కిలోమీటర్ల కొత్త రహదారిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు.వీడియో కాన్ఫరెన్సు ద్వారా పచ్చజెండా ఊపి రాజ్ నాధ్ సింగ్ ఈ కొత్త రహదారిని ప్రారంభించారు. ఛీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఛీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నార్వానే పాల్గొన్నారు. ఈ కొత్త మార్గం అందుబాటులోకి భక్తుల కష్టాలు తీరుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.ఈ మార్గాన్ని బార్డర్‌ రోడ్స్ ఆర్గనైజేష‌న్ నిర్మించింది.ఇంతకు ముందు మూడు వారాలు పట్టే మానసరోవర యాత్రకు ఇకపై వారం రోజుల సమయం మాత్రమే పడుతుందని చెప్పారు. అంతేకాదు పర్వత ప్రాంతాల్లో రవాణా సౌకర్ాలు పెరిగి వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.
ఇప్పటి వరకు సిక్కిం, నేపాల్ మార్గాల్లో లిపులేక్ పాస్ వరకు వెళ్లేవారు. అక్కడి నుంచి మానస సరోవర్ చేరుకునేవారు. ఐతే ఇకపై ఉత్తరాఖండ్‌లోని పిత్తోర్‌గఢ్ నుంచి దార్చుల్లా,గూంజీ మీదుగా నేరుగా లిపులేక్ పాస్ వరకు ప్రయాణించవచ్చు. కైలాస మాసరోవర్ యాత్రకు లిపులేక్‌ను గేట్‌ వేగా పిలుస్తారు. అక్కడి నుంచి 80 కిలోమీటర్లు  ప్రయానిస్తే కైలాస మాససరోవరం వస్తుందని ఆర్మి అధికారులు తెలిపారు.ఈ రహదారి చైనా సరిహద్దులకు భారత సైన్యాన్ని సులభంగా తరలించేందుకు ఎంతో సౌకర్యంగా ఉపకరిస్తుందని చెప్పారు.

Post a Comment

0 Comments