About Me

స్వదేశానికి తిరిగి వచ్చే ఎన్ఆర్ ఐ లకు ప్రత్యేకంగా మెడికల్ టెస్టులు

విదేశాలలో చిక్కుక పోయిన భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు నడపనున్న నేపద్యంలో విదేశాల నుండి తిరిగి ఇండియాకు వచ్చే బారతీయులకు వైద్య పరీక్షలు తప్పని సరి చేయనున్నారు. వారి అనారోగ్కాలకు సంభదించిన మిడికల్ హిస్టరీని కూడ పరిశీలించనున్నారని సమాచారం. కోవిడ్ 19 పాజిటివ్ వారిపట్లు అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల రాయబార కార్యాలయాలను అలర్ట్ చేసారు. విమనాశ్రయాల్లో సాధారణంగా శరీర ఉష్ణోగ్రతల పరీక్షలు అందరికి నిర్వహిస్తారు.కరోనా పాజిటివ్ సోకిన వారిని ప్రయాణానికి ఎట్టి పరిస్థితిలో అనుమతించరాదని సూచించారు.ఇంకా పూర్తి క్లారిటీ కోసం మార్గదర్శకాలు అందాల్సి ఉందని రాయబార కార్యాలయాధికారులు ఎదురు చూస్తున్నారు. పూర్తి స్థాయి టెస్టులు నిర్వహించకుండా ఎన్ఐ లు ను స్వదేశాలకు తీసుకు రావడం సరికాదని కేరళ సిఎం పినరయి విజయన్‌ లేఖ రాసారు.ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయమని విజయన్‌ అభిప్రాయపడ్డారు.
తొలి విడతగా మే నెల 7 నుండి 13 వరకు వారంరోజుల పాటు 12 దేశాల నుండి 64 విమానాల ద్వారా 14,800 మందిని తరలించనున్నారు.ఇండియాకు తిరిగి రానున్న వారు ఇప్పటికే ఆయా దేశాల రాయబార కార్యాలయాల్లో పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. విజిటింగ్ వీసాపై వెళ్ళిన వారు, నివాస గడువు ముగిసిన వారు వృధ్ధులు,గర్భిణిలు,చంటిపిల్లలు కలిగిన వారికి ముందుగా ప్రయాణావికి అనుమతి ఇస్తారు.
ఇండియాకు తిరిగి వచ్చిన వారికి 14 రోజులక్వారెంటన్ నిభందనలు తప్పని సరి చేశారు. తెలంగాణ రాష్ర్టంలో అయితే 28 రోజుల పాటు క్వారెంటైన్లో  ఉండాల్సి ఉందని సిఎం కెసిఆర్ ఇదివరకే పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments