About Me

గుడుంబా.....పంజా..? లిక్కర్ షాపులకు అందుకే అనుమతించారా !

తెలంగాణ రాష్ట్రంలో మందు ప్రియుల టెన్షన్ తీరింది. లిక్కర్ షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెడ్ జోన్లలో కూడ లిక్కర్ అమ్మకాలకు అనుమతులు ఇచ్చారు. కంటైన్ మెంట్లలలో మాత్రం అమ్మకాలకు నో చెప్పారు. మద్యం విక్రయులకు అనుమతి ఇస్తారా లేదా ఇస్తే పొరుగు రాష్ట్రంలో పెంచినట్లు ధరలు పెంచుతారా.....ఎంత పెంచుతారో నని మద్యం ప్రియులు ఆందోళన చెందారు. అయితే ఎలాంటి ఉరుములు మెరుపులు లేకుండా సి.ఎం కెసిఆర్ లిక్కర్ షాపుల పాలసి ప్రకటించారు. ధరలు నామ మాత్రంగా 11 శాతం చీప్ లిక్కర్ బ్రాండ్లు ఇతర బ్రాండ్లపై 16 శాతం పెంచి నట్లు ప్రకటించారు. 
లిక్కర్ విక్రయాలకు అనుమతి ఇవ్వవద్దని కొందరు కోరినా ప్రభుత్వం మాత్రం అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించిన మీదటే అనుమతులకు నిర్ణయం తీసుకుంది.
మరికొంత కాలం లిక్కర్ విక్రయాలకు అనుమతులు లేకుండా ఉంటే బాగుండేదని చాలా మంది కోరినా అనుమతించక తప్పని అనివార్య పరిస్థితులు ఏమిటో కూడ సిఎం వివరించారు. పొరుగు రాష్ట్రాలలో అమ్మ కాలు జరుగుతున్నాయి. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పీరియడ్ కు ముందు పూర్తిగా నియంత్రణలో ఉన్న గుడుంబా తయారి విక్రయాలు తిరిగి క్రమంగా పుంజుకుంటున్నాయి. లిక్కర్ అందుబాటులో లేక జనం గుడుంబాకు అలవాటు పడ్డారు. ఈ సమాచారం ప్రభుత్వాన్ని ఆందోళన పరిచింది. అందుకే విక్రయాలకు అనుమతించక తప్పలేదు.
విక్రయాలకు  అనుతించారని ఎగబడితే కరోనా కాటేస్తుంది. ప్రాణ భయం ఉంటే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తారు. లేకుంటే కరోనా చావుచస్తారు.  ఇక కొందరు సమాజం శ్రేయస్సు కోరి మద్యం వద్దని చెబుతున్నారు మంచిదే కాని మద్య నిషేదం ఎకాఎకిన అమలు చేయడం ప్రాక్టిల్ గా సాద్యం కాక పోవచ్చు. దీని కోసం పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి. ప్రభుత్వం డిఅడిక్షన్ కాంపులు ఏర్పాటు చేయాలి.  మద్యం మాన్పించే ప్రయత్నాలకు సుదీర్ఘ కార్యచరణ అవసరం.

Post a Comment

0 Comments