About Me

హిందువులు గర్జిస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పారిపోతారు....తెలంగాణ బిజెపి అద్యక్షులు బండి సంజయ్

జన సేన పార్టి అధినేత పవన్ కళ్యాన్, తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ హైదరాబాద్ లో భేటి అనంతరం
బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువులు గర్జిస్తే రెండు తెలుగు రాష్ర్టాల   ముఖ్యమంత్రులు చెవుల్లో రక్తం కారి పారి పోతారని అన్నారు. హిందువుల సహనాన్ని పిరికితనంగా భావించవద్దని హెచ్చరించారు. తెలంగాణను ఇస్లాం రాజ్యంగా, ఏపీని క్రైస్తవ రాజ్యంగా మార్చేందుకు కేసీఆర్‌, జగన్‌ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. టిటిడి ఆస్తుల అమ్మకాల అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ కు ఇతర  ప్రార్థనా మందిరాల జోలికి వెళ్లే ధైర్యముందా  అని ప్రశ్నించారు.  అయోధ్య రామ మందిరాన్ని కాపాడుకున్నట్టే తిరుపతిని కాపాడుకుంటామని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని ఇరు పార్టీల ముఖ్యనేతలు గతంలో ప్రకటించిన నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సంజయ్‌ తొలిసారిగా పవన్‌తో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని పవన్‌ ప్రొడక్షన్‌ ఆఫీసులో గంటపాటు వీరి భేటీ జరిగింది.
భేటి అనంతరం పవన్ కళ్యాన్ ఏమి మాట్లాడ లేదు కాని బండి సంజయ్ మాత్రం తమ భేటీలో జరిగిన చర్చలను మీడియాకు వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, టీటీడీ ఆస్తుల విక్రయం, పోతిరెడ్డిపాడు తదితర అంశాలపై చర్చించారు. త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ‘‘ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసే ఉంటారు. అవసరమైతే ప్రాంతీయ విద్వేషాలు రగిలించాలని.లేకుంటే కలిసి దోపిడీ చేయాలని కుట్ర పన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది’’ అని సమావేశంలో అభిప్రాయపడ్డారు. మోదీ అంటే తనకు అభిమానమని పవన్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా, సమావేశం అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ, టీటీడీ ఆస్తులు కాపాడుకోవడానికి కమిటీలు వేయాలి తప్ప, అమ్ముకోవడానికి కాదు అని అన్నారు. బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్‌ చెప్పారని వెల్లడించారు. జనసేనతో కలిసి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామని సంజయ్‌ వివరించారు. కాగా, సంజయ్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు సత్ఫలితాలు అందుతాయని పవన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments