About Me

కొండెక్కిన కోడి ధరలు - అంతా కరోనా మహాత్యం

చికెన్ ధరలు మండి పోతున్నాయి.కరోనా కల్లోలంలో ఎగుడు దిగుడులు గమ్మతుగా జరిగి పోతున్నాయి.కరోనా ప్రారంభంలో చికెన్ అంటే ముఖం విరిచిన వాళ్ళు ఇప్పుడు చికెనే కావాలని ఎగ బడుతున్నారు. మొదటి లాక్ డౌన్ ప్రారంభంలో టికెన్ తింటే కరోనా అంటుకుంటుందనే వదంతులు వ్యాప్తి చెందడంతో చాలా మంది తినడం మానేసారు.కనీసం గుడ్లుకూడ ఇష్ట పడ లేదు.దాంతో అప్పట్లో చికెన్ ధరలు బాగా పడిపోయాయి.కోళ్ళను కొనేవాళ్ళు లేక రైతులు పూడ్చి పెట్టారు.కొన్ని చోట్ల ఫ్రీగా పంచి పెట్టారు.రూ 20 -30 కి చొప్పున కోళ్ళను విక్రయించారు.తీవ్రంగా కోళ్ల పెంపకం దారులు నష్టాలు చూశారు.చికెన్ తింటే కరోనా ఏం రాదని ప్రజలకు భరోసా కల్పించేందుకు మంత్రి కెటిఆఅర్ చికెన్ తిని మరి చూపించారు.కరోనా ను తట్టుకునేందుకు మంచి పౌష్టికాహారం తినాలని వైద్య్లులు సూచిస్తుండడంతో ఇప్పుడుటికెన్ కోసం ఎగ బడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చికెన్ ధరు రూ 220 నుండి రూ 224 వరకు ఉంది. బెంగళూరు, చెన్నై, విజయవాడ తదితర నగరాల్లో కూడ చికెన్ ధరలు పెరిగాయి.ఎగ్స్ ధర కూడ పెరిగింది.రూ. 60 నుండి రూ.70 కు డజన్ చొప్పున విక్రయిస్తున్నారు.

Post a Comment

0 Comments