About Me

కరోనా పై ట్రంప్ ది వైరాగ్యమా? ఆగ్రహమా!

కరోనాపై అమెరికా ప్రెజిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ది వైరోగ్యమో లేక ఆగ్రహమో అర్దం కాని పరిస్థితి. ఓ వైపు కుప్పలు తెప్పల మరణాలు  మరో వైపు లాక్డౌన్ తో అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం ఈ రెండు ట్రంప్ ను తీవ్ర అసహనం వైపు  నెట్టాయి. ఆయన అసహనం మామూలుగా లేదు. కనీసం మాస్కులు కూడ ధరించేందుకు ట్రంప్ అంగీకిరంచడం లేదు. చస్తే చస్తారన్న రీతిలో ట్రంప్ వ్యవహారం ఉందని విమర్శలు వస్తున్నాయి.ఆంక్షల సడలింపులో తొందరపడొద్దన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల్నిట్రంప్ పట్టుచుకునే స్థితిలో లేడు. చావుల సంగతి అటు ఉంచితే అమెరికా ఆర్థిక వ్యవహారాలు ముఖ్యమనే రీతిలో ఆయన ధోరణి కనిపిస్తోంది.లాక్ డౌన్ నష్టాల నుండి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలనే ఆగ్ర రాజ్య పోకడ కకనిపిస్తోెంది.
అందుకే ఆక్షల సడలింపు అనివార్యం అవుతుందని వైరస్ వ్యాప్తి పెరిగి మరణాలు కూడ పెరుగుతాయని ట్రంప్ స్వయంగా అంగీకరించాడు. ఫీనిక్స్‌లోని హనీవెల్‌ ఫ్యాక్టరీని  ట్రంప్‌ సందర్శించిన సందర్భంలో ఆయన భావాలు వ్యక్తం అయ్యాయి.. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత ఆయన తొలి పర్యటన ఇదే. అయితే అక్కడ ఆయన మాస్క్‌ ధరించడానికి నిరాకరించడం గమనార్హం. ఫ్యాక్టరీని సందర్శించేవారు కచ్చితంగా మాస్కులు ధరించాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ.ఆయన దాన్ని పాటించలేదు.మొదటి నుంచి ఆయన మాస్కును ధరించడానికి నిరాకరిస్తూ వస్తున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఆంక్షల సడలింపు వల్ల ప్రజలు ఇంటికే పరిమితమయ్యే అవకాశం లేదని వైరస్ వ్యాప్తి పెరిగి మరణాలూ పెరిగే అవకాశం ఉందని స్వయంగా ఆయనే వివరించారు.అయినా, ఆర్థిక వ్యవస్థనూ తెరవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ట్రంప్ మాటలను ఆయన వ్యవహార శైలిని విశ్లేషించిన వారు ఇక అమెరికాలో ఆంక్షలను క్రమంగా సడలించి పూర్తి స్థాయిలో ఎత్తి వేస్తారని అంటున్నారు. కరోనాను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ను కూడ ఎత్తి వేశారు.కరోనా కట్టడి వ్యవహారంలో  ఆయన నోటి నుండే కాక ట్విట్టర్ నుండి కూడ వైరాగ్యం ట్వీట్లు వస్తున్నాయి.గత ఏడాది ఫ్లూవల్ల37వేల మంది చనిపోయారని ట్రంప్ గతంలో  ట్వీట్ చేశారు.దీనికారణంగా ఏడాదికి 27 వేల నుండి 70 వేలవరకు మరణాలు సంభవిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నాడు.

Post a Comment

0 Comments