About Me

ఆంధ్రాలో మద్యం ప్రియులకు జగన్ సర్కార్ షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ప్రియులకు వైన్ షాపులు ఓపెన్ అయ్యాయన్న సంతోషం లేకుండా పోయింది. మద్యం ప్రియులకు దిమ్మ తరిగి పోయేలా సర్కార్ మద్యం రేట్లను ఎకాఎకిన 25శాతానికి పెంచేసేంది. కరోనాతో ఇంత కాలం షాపులు మూత పడి మద్యం ప్రియులు మందు  కోసం అల్లాడి పోయారు. ధరలు పెంచతూ నిర్ణయం తీసుకోవడం వారికి మింగుడు పడడం లేదు.
ఎన్నికల సమయంలో జగన్ అంచెల వారీగా మద్య నిషేదం అమలు చేస్తానని ఇచ్చిన హామి మేరకు అధికారంలోకి వచ్చినప్పటి నుండి క్రమంగా ఆ దిశగా అడుగులు వేస్తువచ్చారు.ఎక్సైజ్ శాఖలో మద్యం విక్రయాల్లో భారి మార్పులు తీసుకువచ్చారు. షాపులకు నిర్ణీత వేళలు ఖరారు చేయడంతో పాటు విక్రయాలపై నియంత్రణ విధించారు. జగన్ నిర్ణయాలపట్ల ఆంధ్రలో మహిళలు కొంత మేరకు సంతోషంతో ఉన్నారు.
కరోనా లాక్ డౌన్ సడలింపు అనంతరం తెరిచిన వైన్ షాపుల్లో ధరలు ఎందుకు పెంచినట్లంటే షాపుల వద్ద జనం ఎక్కువగా గుమి కూడ వద్దనే ఉద్దేశంతో రద్దీ లేకుండా ఉండేందుకని అధికారులు చెబుతున్నారు. ధరలు పెంచినా తాగే వారు తాగకుండా ఉంటాారా!... తాగేస్తారు.

Post a Comment

0 Comments