About Me

ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ జమ్మూ కశ్మీర్ విభాగం చీఫ్ రియాజ్ నయికూ ఎన్‌‌కౌంటర్లో చనిపోయాడు.బుధవారం దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారత భద్రతాదళాలకు ఉగ్ర వాదులకు మద్య ఎదుకు కాల్పులు జరిగాయి.హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్,జమ్మూ కశ్మీర్ విభాగం చీఫ్‌గా అతడు రియాజ్ నయికూ పనిచేశాడు. హిజ్బుల్ చీఫ్ సయ్యిద్ సలహుద్దీన్‌కు నయికూ సన్నిహితుడు.గత 8 ఏళ్లుగా భద్రతా దళల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఇది భారత భద్రతా దళాలకు భారి విజయంగా చెప్పవచ్చు.బేగ్‌పురాలోని తన ఇంటిలో రియాజ్‌ నైకూ ఉన్నాడనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు 40 కిలోల ఐఈడీతో ఇంటిని పేల్చివేశాయి.ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.

Post a Comment

0 Comments