About Me

విప్ల వీరుడి పాత్ర అయనకే స్వంతం

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే మనకు గుర్తు వచ్చేది కృష్ణ. అంతగా ఆయన ఆ పాత్రలో ఒదిగి పోయాడు. కొన్ని పాత్రలు కొందరికి మీనహా ఇతరులకు ఒదగవు. ఆ కోవలోకి వచ్చేదే ఆల్లూరి సీతారామరాజు పాత్ర. కృష్ణ 100వ చిత్ర ంఇది. 1.04-1974 లో సినిమా విడుదల అయింది. 2020 నాటికి ఈ సినిమా 46 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.అల్లూరి సీతారామ రాజు పాత్ర ఎన్టీ రామారావుకు చాలా ఇష్టమట. తన నటనా జీవితంలో అనేక సాంఘీక, పౌరాణిక పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్న ఎన్టీఆర్ చివరికి అల్లూరి సీతారామా రాజు సినిమా తీయకుండా విరమించుకున్నారట. కృష్ణ సినిమా అనంతరం ఎన్టీఆర్ ఈ సనిమా తీయాలని  పరుచూరి బ్రదర్స్ ను స్క్రిప్ట్ కోసం పురమాయించాడట. అయితే వారు ఒక్క సారి కృష్ణ సినిమా చూడంండంటూ ఆయనకు చెప్పారటు. దాంతో ఎన్టీఆర్ కృష్ణతో మాట్లాడి  స్పెషల్ షో వేయించుకుని చూసి బాగుందని అభినందించాడట.
శ్రీకృష్ణుడి పాత్రలకు ఎన్టీఆర్, దేవదాసు పాత్రకు నాగేశ్వర్ రావు, అల్లూరి సీతారామ రాజు పాత్రకు కృష్ణ తప్ప ఇతరలు ఎవరూ సరితూగరని నిరూపించారు.

Post a Comment

0 Comments