About Me

త్వరలో కరోనా రోగులపై ఆయుర్వేద ఔషధ ప్రయోగం

ప్రపంచంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించగలిగేందుకు భారతీయ వైద్యం అయిన ఆయుర్వేదంలో పలు ప్రయోగాలు అనేకం జరిగాయ. ఆయుష్ శాఖ అధ్వర్యంలో జరిగిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని చెబుతున్నారు. బారతీయ ఆయుర్వేద ఔషధ నిపుణులు తయారు చేసిన ఔషదాన్ని త్వరలోకరోనా రోగుల పై ప్రయోగించనున్నారు. ఈ విషయాన్ని ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ వై నాయక్ స్వయంగా  ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారం రోజుల్లో కరోనా రోగులపై ఆయుర్వేద ఔషద ప్రయోగాలు చేపడతారని తెలిపారు.కరోనా మహమ్మారిని రూపుమాపేందుకు భారతీయ వైద్యంలో పరిష్కారం లభిస్తుందని తనకు నమ్మకం ఉందని మంత్రి తెలిపారు. నరేంద్ర మోది ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ వైద్యం రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ఆయుర్వేద, యునాని, సిద్ద, హోమియోపతి వైద్యం ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిదిలో చేర్చారు.
బారత సనాతన వైద్యంలో ఆయుర్వేద వైద్య చికిత్సకు అత్యధిక ప్రాధాన్యత లభించింది. కరోనాపై భారత దేశం తయారు చేసిన ఆయుర్వేద ఔషధం పనిచేస్తే భారతీయ ఆయుర్వేద రంగానికి అధిక ప్రాధాన్యత చేకూరుతుంది.

Post a Comment

0 Comments