About Me

హైదరాబాద్ కు పెట్టు బడులు వచ్చే అవకాశం..సిఎం కెసిఆర్

కరోనా కల్లోలం అలా ఉంచితే ఈ అనుభవంలో కొన్ని మంచి కూడ జరుగుతున్నాయి. హైదరాబాద్ చల్లగా ఉండాలే కాని ముందు ముందు పెట్టు బడులకు కొదువు లేదసిఎం కెసిఆర్ ఇదే విషయంలో ఆశాభావంతో ఉన్నారు. హైదరాబాద్ చల్లగా ఉండాలి చైనా నుంచి వెనక్కి మళ్లే పెట్టు బడులు దక్షిణ భారత దేశంలో హైదరాబాద్ కే వచ్చే అవకాశం ఉందని మీడియా ముఖంగా ఆయన చెప్పారు.
 చైనా నుండి అనేక పాశ్చాత్య దేశాలు తమ పెట్టు బడులు   ఉపసంహహరించు కుంటున్నాయి.కరోనా విషయంలో చైనా పారదర్శకత పాటించక పోవడంతో ప్రపంచం అంతా కుదేలైంది. ఈ దేశంలో యూరోపియన్ దేశాల మల్టినేషనల్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఆపిల్ కంపెని సహా అనేక కంపెనీలు ఇక చైనా నుంచి పనిచేసే పరిస్థితి లేదు. ఐటి రంగంలో ఇండియాలో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ మధ్య చెన్నై నగరాన్ని భారి వరదలు ముంచెత్తినపుడు మల్టినేషనల్ కంపెనీలు హైదరాబాద్ వైపు చూశాయి. భారత దేశంలో హైదరాబాద్ వంటి సురక్షిత నగరం మరోటి లేదు. దక్ణిణ పీఠభూమిలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో ప్రృకృతి వైపరీత్యాలు చాలా తక్కువ. ఐటిరంగంలో కర్నాటక రాష్ట్రం లోని బెంగళూరు ప్రఖ్యాత కేంద్రంగా ఉండేది కాని ప్రస్తుతం బెంగళూరుకన్నా హైదరాబ్ సురక్షితం అనేది తేటతెల్లం అయింది. బెంగళూరులో నీటి సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. హైదరాబాద్ కు మంచి నీటి కొరత లేదు. కృష్ణా, గోదావరి నదుల నుండి రెండు వైపులా హైదరాబాద్ నగరానికి మంచి నీరు అందుతోంది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కాళేశ్వరం వంటి భారి ప్రాజెక్టుల వల్ల ఏ జిల్లాలలో నీటి కొరత లేదు. హైదరాబాదే కాకుండా వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాల్లో కూడ పరిశ్రమలకు మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. టైర్ టూ సిటీలు అయిన ఈ జిల్లాలలో ఇప్పటికే ఐటి పరిశ్రమలు నెల కొల్పారు.
ఇక తెలంగాణకు ఉన్న మంచి వనరు అన్నిటికన్నా గొప్పగా చెప్పు కోవాలంటే ఐ.టి శాఖ మంత్రి కెటిఆర్. ఆయన అసమాన ప్రతిభా పాటవాలు తెలంగాణకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. హైదరాబాద్ కు పెట్టు బడులు వచ్చే విషయంలో కెటిఆర్ ఏ అవకాశాన్ని చేజార్చుకోకుండా చేసే నూటికి నూరం శాతం కృషి ప్రపంచ  పటంలో హైదరాబాద్ కు ఓ ప్రత్యేక గుర్తింపు తేనుంది.

Post a Comment

0 Comments