About Me

ఇద్దరు ఉగ్ర వాదులు హతం...కల్నల్ సహా ఐదుగురు వీరమరణం

ప్రాణాలకు తెగించి పౌరులను కాపాడిన భద్రతా దళాలు 
ప్రపంచం అంతా కరోనాతో పోరాడుతుంటే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఇదే అదునుపా భావించి భారత దేశంలోకి చొరబడుతున్నారు.నార్త్ కశ్మీర్ ప్రాంతంలోని హంద్వారా సమీపంలో శనివారం భద్రతా దళాలకు ,ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు చనిపోయారు.ఈ ఆ పరేషన్ లో ఓ మేజర్‌,కల్నల్‌ స్థాయి సైనికాధికారులతో సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు.ప్రాణాలు ఫణంగా పెట్టి ముష్కరుల నుండి పౌరులను కాపాడ గలిగారు. ఓ ఇంట్లో ముష్కరులు బందీలుగా చేసుకున్న కొంత మంది పౌరులను రక్షించేందుకు చేపట్టిన  ఈ ఆపరేషన్‌లో భాగంగా సైనికులు ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేసారు.భద్రతా దళాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు  కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్‌ అశుతోష్‌ శర్మ, ఓ మేజర్‌ అమరులయ్యారు. అశుతోష్‌ శర్మ 21 రాష్ట్రీయ రైఫిల్స్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు ఓ ఎస్సై, ఇద్దరు సైనికులు కూడా వీరమరణం పొందారు. ఎట్టకేలకు పౌరుల్ని మాత్రం సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు.

Post a Comment

0 Comments